విజయ్ దేవేరుకోండ ” నోటా ” రివ్యూ & రేటింగ్

101

సినిమా : నోటా
బ్యానర్‌: స్టూడియో గ్రీన్
నటీనటులు: విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పిర్జాదా, నాజర్‌, సత్యరాజ్‌
కొరియోగ్రఫీ: సంతానా కృష్ణన్ రవిచంద్రన్
సంగీత దర్శకుడు: శక్తీకాంత్ కార్తీక్
దర్శకుడు: ఆనంద్ శంకర్

అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి చిత్రాల విజయాలతో విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, ప్రేమకథలతో ఆకట్టుకున్న విజయ్ మొదటిసారిగా ప్రయోగాత్మకంగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ”నోటా ”లో నటించాడు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. వరుస విజయాలతో జోరు మీదున్న విజయ్ నోటాకు భారీ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది.

ఇప్పటి వరకు విజయ్ అంటే ప్రేమ, ఫ్యామిలీ స్టోరీలే చేశాడు. రొటీన్‌కు భిన్నంగా కొత్తగా ట్రై చేసినా కథలో దమ్ము లేకపోవడంతో సినిమా తేలిపోయింది. ఫస్టాఫ్ సినిమా సీరియస్ మోడ్‌లో సాగుతూ యావరేజ్‌గా మెప్పించినా కీలకమైన సెకండాఫ్‌లో దర్శకుడు చేతులు ఎత్తేశాడు. సెకండాఫ్ అంతా స్క్రీన్ ప్లే తేలిపోయింది. గ్రిప్పింగ్ సన్నివేశాలు లేకుండా బోర్ కొట్టించింది. ఈ సినిమా తమిళ రాజకీయాలకు దగ్గరగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అన్న సందేహం కూడా కలుగుతోంది. మొత్తానికి ఈ సినిమా విజయ్ కు అంతగా సూట్ కాలేదనే చెప్పాలి.

కథ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్ ) ఉంటాడు. ఒక స్వామి జి సలహా మేరకు ఆయన కుమారుడు వరుణ్ (విజయ్ దేవరకొండ)ను ముఖ్యమంత్రిగా చేస్తాడు. వాసుదేవ్ అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన తర్వాత, రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ పరిస్థితులు వరుణ్ ని ఒక కొత్త రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతుంది. మిగిలిన కథ వరుణ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంకా ఏం జరిగింది అనే కధాంశంతో సాగుతుంది.

ఫెర్ఫామెన్స్ : ఈ సినిమా కథాంశానికి విజయ్ సూట్ అవ్వలేదనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా కథాంశంపై విజయ దృష్టిపెట్టి ఉంటే .. యువతను ఎక్కువగా ఆకర్షించగలిగేది. ఇందులో విజయ్ పాత్రను తప్పు పట్టడంలేదు కానీ… ఈ సినిమాలో విజయ్ పాత్ర ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదనే చెప్పాలి. ఇక హీరోయిన్ మెహ్రీన్ పాత్ర విషయానికి వస్తే అతిధి పాత్రలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి పెద్దగా చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు.

సీనియర్ నటులు నాజర్, సత్యరాజ్ సుదీర్ఘమైన ప్రాధాన్యత కలిగిన పాత్రలు పొందారు. ఈ చిత్రంలోని చాలా సీన్లు ఈ రెండు పాత్రలతో ముడిపడి ఉంటాయి. ఈ రెండు పాత్రలు సినిమాకి బాగా ఉపయోగపడ్డాయి. రెండవ భాగంలో నాజర్ మేకప్ కొద్దిగా ఎబ్బెట్టుగా కనిపించింది. ఎం ఎస్ భాస్కర్, ప్రియదర్శి ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.

విశ్లేషణ :

యంగ్ అండ్ క్రేజీ హీరోతో ఒక రాజకీయ కోణాన్ని నడిపించాలని ప్రయత్నించారు. అయితే ఈ కధలో ఆ స్థాయిలో దమ్ము కనిపించలేదు. వాస్తవానికి ప్రతి రాజకీయ కథ లోతుగా ఉండకపోయినా, ప్రేక్షకులను 2.5 గంటల పాటు ఉంచడానికి కనీస ఆసక్తిని కలిగించే కథ అవసరం. సామాన్యుల సమస్యల మీద పోరాడుతూ .. పరిష్కారాలు వెతకడం .. ఇందులో ఉండే రాజకీయాలు ఈ సినిమాలో చూపించారు.

స్వామీజీకి బినామీ కూడా ఉన్న అవినీతి మంత్రి, వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాసుదేవ్ (నాజర్ ) జైలుకు వెళ్లిన తర్వాత స్వామిజీ మొత్తం ఆస్తిని కొట్టేయాలని చూస్తాడు. అంతే కాకుండా సీఎం పీఠం కూడా కొట్టేయాలని స్వామిజి ప్రయత్నిస్తుంటాడు. మరో వైపు సీఎంగా ఉన్న వరుణ్ ప్రభుత్వ అధికారులను, పార్టీ కార్యకర్తలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.
1
ఈ సినిమాలో మొదటి భాగం ఫర్వాలేదు అనిపించినా .. రెండో భాగం ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెడుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సరైన సంభాషణలు ఈ సినిమాలో కనిపించవు. రాజకీయ కుట్రలు, ఆసుపత్రి సన్నివేశాలు, రిసార్ట్ క్యాంప్ సన్నివేశాలతో కలిసిన రాజకీయ నాటకం, తమిళనాడు రాజకీయాలను మనకి గుర్తుచేస్తుంది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ సినిమాలో కామెడీ కూడా పెద్దగా పండలేదు. నాజర్ ప్లాష్ బ్యాక్ .. సత్యరాజ్ పాత్రల పొడవు ఎక్కువయినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ కి అందులోని స్టోరీ కి ఏ విధమైన సంబంధం లేనట్టుగా ఈ సినిమాలో సీన్లు ఉన్నాయి.

లోపాలు : బలహీనమైన కథ , సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించే అంశాలు లేకపోవడం, బోర్ కొట్టించే సెకండ్ ఆఫ్ .

రేటింగ్ :2 /5

Leave a comment