Gossipsనిత్య షాకింగ్ కామెంట్స్ దర్శకులందరూ నిత్య‌ని చంపాలనే కోరుకుంటున్నారు

నిత్య షాకింగ్ కామెంట్స్ దర్శకులందరూ నిత్య‌ని చంపాలనే కోరుకుంటున్నారు

న‌టిగా రాణించ‌డం క‌ష్టం

నాయ‌కిగా మెప్పించ‌డం సులువు

నిత్యా మేన‌న్ కి న‌టిగా గుర్తింపు తెచ్చుకోవ‌డం తెల్సు

నాయ‌కిగా తానేంటో గుర్తించుకునేలా చేయ‌డ‌మూ తెల్సు

ద‌టీజ్ నిత్య.

ఇక వివ‌రాలిలా.. : ‘మెర్సల్‌’ అమోఘ విజయం సాధించిన నేపథ్యంలో నిత్య మీడి యాతో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌ ప్రారంభం నుంచి భిన్నమైన సినిమాల్లో నటిస్తున్నాను. నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తాను.

నిజానికి ‘మెర్సల్‌’ కంటే ముందు ‘రాజారాణి’, ‘తెరి’ చిత్రాల్లోనే అట్లీతో పనిచేయాల్సి ఉంది. అది ఈ సినిమాతో కుదిరింది. ఇంకో విషయం ఏంటంటే… దర్శకులందరూ నా పాత్రల్ని చంపాలనే కోరుకుంటున్నారు (నవ్వుతూ…). ఒక మంచి పాత్ర మరణిస్తే సెంటిమెంట్‌ ఎక్కువగా పండు తుంది. అది వారి ఆలోచన. మంచి పేరు తెచ్చే పాత్రలు చేయడం నాకూ ఇష్టమే’’ అని పేర్కొంది.

ఇంకా రానున్న కాలంలో మ‌రిన్ని మంచి పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు స‌న్నాహాలు చేస్తోందీ భామ‌.తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న‌కంటూ సృష్టించుకున్న ఓ ఇమేజ్ ని ప‌దిల‌ప‌రుచుకోవాల‌ని భావిస్తోందీ ముద్దుగుమ్మ‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news