ఇది కదా అదిరే న్యూస్…ఆ సినిమా నితిన్ చేసుంటే..!

nithin sukumar arya allu arjun bunny

సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది. ఆర్య ఫీల్ మై లవ్ అన్న మాట అప్పటి యూత్ అంతా జపం చేశారనుకోండి. ఇక వన్ సైడ్ లవర్స్ కు ఆర్య ఎంత ప్రోత్సాహం ఇచ్చాడో తెలిసిందే. అయితే సుకుమార్ అల్లు అర్జున్ తో ఈ సినిమా నితిన్ తో చేసే ఎలా ఉండేది. ఊహించడానికి కాస్త షాకింగ్ గానే ఉన్నా ఇది నిజమే అట.

వినాయక్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న సమయంలోనే ఆర్య లైన్ అనుకున్నాడట సుకుమార్. వినాయక్ నితిన్ తో దిల్ చేస్తున్న సమయంలో నితిన్ తో కలిసి ఈ కథ డిస్కస్ చేశాడట సుక్కు. అయితే అప్పటికి కథ మొత్తం పూర్తి కాలేదట. అంతా గజిబిజిగా నేరేట్ చేశాడట. కొత్త దర్శకుడు ఎందుకు రిస్క్ అనుకున్నాడో ఏమో కాని నితిన్ మాత్రం ఆర్య ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

తీరా చూస్తే అల్లు అర్జున్ ను స్టార్ ను చేసిన సినిమా ఆర్య. ఆ తర్వాత ఆర్య-2 కూడా వచ్చిందని తెలిసిందే. ఆర్యతో మొదలైన సుకుమార్ బన్నిల బాండింగ్ ఇప్పటికి అలానే ఉంది. సో అలా నితిన్ తన దగ్గరకు వచ్చిన ఆర్య కథను మిస్ చేసుకున్నాడట. ఈ విషయం నితిన్ లై ఆడియోలో సుకుమార్ ప్రేక్షకులతో పంచుకోవడం విశేషం.

Leave a comment