Gossipsఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నితిన్..!

ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నితిన్..!

శతమానం భవతి సినిమాతో మంచి ఊపు మీద ఉన్న దర్శకుడు సతీష్ వేగేశ్న మరో బ్లాక్ బ్లాస్టర్ ప్రేక్షకులకు అందించేందుకు సిద్దమయిపోయాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “శ్రీనివాస కళ్యాణం” అనే సినిమాకు శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే.

ఈ కథను ముందుగా నాగార్జున తో చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లింది. తారక్ ఒకే చేశాడు శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ ను కూడా ఒకే చేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే తారక్ తప్పుకోవడంతో ఫైనల్ గా నితిన్ సినిమాలోకి వచ్చాడు. శతమానం భవతి సినిమా తర్వాత సతీష్ వేగేశ్న చేస్తోన్నరెండవ చిత్రమిది.

లై సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ని అందుకున్న నితిన్ కు నెక్స్ట్ ఏ సినిమా తీయాలనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే సతీష్ కథ నచ్చడంతో నెక్స్ట్ ఇదే సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు.
తాజాగా నితిన్ కు చెప్పిన కథ ఒకే అవ్వడంతో త్వరలోనే దిల్ రాజు సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఈ కథపై ఒక కొత్త ఊహాగానం కూడా తెరపైకి వచ్చింది గతంలో ఎన్టీఆర్ తో దిల్ రాజుతో సినిమాను చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సతీష్ వేగేశ్న రెండు మూడు సార్లు కథను కూడా వినిపించాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం కథలో కొంత భాగం నచ్చలేదని చెప్పడంతో ఆ సినిమా ఇప్పుడు నితిన్ కి ఆ స్టోరీ చెప్పి ఒకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా డైవర్షన్ లు దిల్ రాజుకు చాలా కామన్. గతంలో ఇలాంటి మంచి కధలను పెద్ద హీరోలకు వినిపించడం వారు తిరస్కరించడం, దీంతో అదే కథతో చిన్న హీరోని పెట్టి పెద్ద బ్లాక్ బ్లాస్టర్ పొందడం దిల్ రాజుకి అలవాటే.

ఈ సినిమాను దిల్ రాజు మరి కొద్దీ రోజుల్లో అధికారికంగా మొదలుపెట్టి అప్పుడు పూర్తి వివరాలు బయటపెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు నితిన్ కాంబినేషన్ లో వచ్చిన దిల్ సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా దిల్ అనే పేరు ఇంటిపేరుగా మారిపోయిన సంగతి అందరికి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news