Moviesబికినీతో హీట్ పెంచుతా అంటోన్న పవన్ హీరోయిన్ !

బికినీతో హీట్ పెంచుతా అంటోన్న పవన్ హీరోయిన్ !

గ్లామర్‌ పుష్కలంగా ఉన్నా సక్సెస్‌ లేకపోతే టాలీవుడ్‌లో అవకాశాలూ రావు. కన్నడ, తమిళ సినిమాలతో టైమ్‌ పాస్‌ చేస్తూ, అప్పుడప్పుడూ తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ టాలీవుడ్‌లో నిఖీషా పటేల్‌కి ఫ్లాప్‌ మీద ఫ్లాపే వస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా కళ్యాణ్‌రామ్‌ నిర్మించి, నటించిన ‘ఓం 3డి’ సినిమాలో నిఖీషాపటేల్‌ నటించింది. అది కూడా పెద్ద ఫ్లాప్‌.

మెగా ప్రొడ్యూసర్‌ ఎంఎస్‌ రాజు నిఖీషా పటేల్‌తో ‘రంభ ఊర్వశి మేనక’ అనే సినిమా చేయాలనుకున్నా ఆర్థిక సమస్యలతో ఆ సినిమా ఆగిపోయింది. రెండు సినిమాలు ఫ్లాప్‌, ఓ సినిమా నిర్మాణ దశలో ఆగిపోవడం ద్వారా నిఖీషా పటేల్‌కి టాలీవుడ్‌లో ఐరన్‌ లెగ్‌ ఇమేజ్‌ ఇంకా బలపడింది.

Nikesha-Patel-Hot-Photo-Photoshoot-Actress-2 Nikesha Patel Photos _8__001 nikeshapatel_www_lateststills_com_7

దీంతో ఈ  అందాల భామ రూటు మార్చింది. ఇక ఇలా ఉంటే లాభం లేదు అనుకుందో ఏమో కానీ ఇప్పుడు  బికినీ తో అదరగొట్టేస్తా అంటోంది. హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోవాలంటే తప్పకుండా బికినీ ధరించాల్సిందే. అప్పుడే తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులు ఫిదా అవుతారు అన్న నిజం తెలుసుకున్న ప్రతి హీరోయిన్ బికినీలో సొగసులు చూపించి వేడి పుట్టిస్తున్నారు. ఆ లిస్టులో పవన్‌కళ్యాణ్ హీరోయిన్ ఏ మాత్రం తగ్గడంలేదు.

ప్రస్తుతం చేతిలో సినిమాలు బాగా తగ్గడంతో గ్లామర్ మంత్రాన్ని నమ్ముకుంది. అందుకే అడపా దడపా బికినీ ఫోజులిచ్చి సోషల్ మీడియాలోకి వదిలేస్తోంది. అసలే అందాల భామ, పైగా బికినీ సొగసులు అంటే ఎలా వుంటుంది చెప్పండీ! ఇంతకూ ఎవరా భామ, ఏమా కథ అంటే.. పవన్‌కళ్యాణ్ సరసన కొమరం ఫులి చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన నికిషా పటేల్. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన చిన్నా చితకా సినిమాలు చేస్తూ ఇన్నాళ్లూ నెట్టుకొచ్చింది. ఈమధ్య అవి కూడా తగ్గడంతో గ్లామర్ డోస్ పెంచే పనిలో పడింది. ఇప్పటికే పలుమార్లు నికిషా బికినీ అందాలు ప్రేక్షకులకు వేడి పుట్టించాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news