NGK క్లోజింగ్ కలెక్షన్స్.. హ్యాట్రిక్ కొట్టిన సూర్య

5

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఎన్‌జీకే ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటించడంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ కొడుతుందా అని ఆతృతగా ఎదురుచూశారు తమిళ తంబీలు.
“>కట్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అస్సలు కొత్తదనమే లేని ఈ సినిమా ఆడియెన్స్‌ను జండుబామ్‌ కొనేలా చేసింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా దారుణమైన వసూళ్లు సాధించింది. రూ.9 కోట్ల మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 4 కోట్ల వసూళ్లతో దుకాణం మూసేసింది. ఇక ఈ సినిమాతో సూర్య వరుసగా మూడు డిజాస్టర్లు అందించి హ్యాట్రిక్ కొట్టాడు. ఏరియాలవారీగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 1.20
సీడెడ్ – 0.77
ఉత్తరాంధ్ర – 0.75
గుంటూరు – 0.49
ఈస్ట్ గోదావరి – 0.35
వెస్ట్ గోదావరి – 0.29
కృష్ణా – 0.45
నెల్లూరు – 0.23
టోటల్ ఏపీ+తెలంగాణ – 4.53 కోట్లు

Leave a comment