Moviesఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో సంచ‌ల‌నం... అది ఇదే

ఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో సంచ‌ల‌నం… అది ఇదే

అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా మారిపోయింది ఫిలిం ఇండ్రస్ట్రీ. వస్తే సినిమాలన్నీ ఒకేసారి కట్టగట్టుకుని రిలీజ్ అవుతున్నాయి. లేకపోతే చాలా కాలం వరకు ఆ సందడే కనిపించదు. కానీ ఈ రాబోయే శుక్రవారం మాత్రం పెద్ద సంచ‌ల‌నం న‌మోదుకానుంది. ఆ రోజు ఏకంగా ఎనిమిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిల్లో గోపీచంద్ ‘ఆక్సిజన్‌’ సినిమా కూడా ఉంది. ఏఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. వాయిదా పడుతూ వచ్చే శుక్రవారం  (నవంబర్ 17) రిలీజ్ కు రెడీ అయ్యింది.

తమిళ్ స్టార్ కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన ఖాకీ సినిమా కూడా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుని ఇప్పటికే ఒకట్రెండు సార్లు వాయిదా పడిన సిద్ధార్థ్ ‘గృహం’ కూడా వచ్చే శుక్రవారం రిలీజ్ కానుంది. లండన్ బాబులు , దేవీశ్రీ ప్రసాద్ , లవర్స్ క్లబ్‌, ప్రేమతో కార్తిక్ వంటి చిత్రాలు వచ్చే శుక్రవారం రిలీజ్ కానున్నాయి. వీటికి తోడుగా మ‌రో రెండు చిన్న సినిమాల‌ను కూడా థియేట‌ర్ల‌లోకి తెచ్చేంద‌కు ఆ చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

వచ్చే శుక్రవారం చిన్ని సినిమాలే ఎక్కువగా ఉన్నా.. ఈ మధ్య చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని నమోదు చేస్తున్నాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి.. తదితర సినిమాలు ఇలాగే వచ్చి సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. అయితే రాబోయే శుక్రవారం ఎన్ని హిట్ టాక్ తెచుకుంటాయో, ఎన్ని షెడ్ కి వెళ్తాయో చూడాలి మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news