Gossipsవారసులొస్తున్నారు... వారంతా 'సూపర్ స్టార్' లేనా..?

వారసులొస్తున్నారు… వారంతా ‘సూపర్ స్టార్’ లేనా..?

సినిమాల్లోనూరాజకీయాల్లోనూ వారసుల హడావుడి ఎక్కువగానే కనిపిస్తోందిఅసలు ముందు నుంచి ఈ ఆనవాయితీ సంప్రదాయం గానే వస్తోందిప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీలో ఎక్కువ మంది సినీ యాక్టర్లున్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీదేదాదాపు పది మంది వరకు ఉన్నారువీరి తర్వాత అక్కినేనినందమూరిదగ్గుబాటి కుటుంబాల్లో ఎక్కువమంది సినీ తారలు కనిపిస్తున్నారుఅయితే ముందు ముందు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ కూడా ఎక్కువమంది తారలతో కళకళలాడేలా కనిపిస్తోందిఆ ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది సినీ ఇండస్ట్రీలో వెలిగిపోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.

నరేష్ తనయుడు నవీన్ కృష్ణ ఓ సినిమాతో పలకరించాడుఇప్పుడతను హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయిమరోవైపు కృష్ణ కూతురుమహేష్ అక్క మంజుల మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందిఆమె దర్శకురాలిగా ఓ సినిమా చేస్తోంది.ఇందులో ఆమె కూతురు జాన్వి ఓ కీలక పాత్రలో నటిస్తోందిఇంతలోనే మహేష్ మేనల్లుడు ఎంపీ గల్లా జయదేవ్పద్మావతిల కుమారుడు అశోక్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని.. అతడిని దిల్ రాజు హీరోగా పరిచయం చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

అలాగే రమేష్ బాబు కొడుకు కూడా త్వరలోనే హీరో అవుతాడని అంటున్నారుఇప్పటికే బాలనటుడిగా నటించిన మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా కొంచెం పెద్దవాడయ్యాక హీరో కావడం గ్యారెంటీగానే కనిపిస్తోందిమరోవైపు సుధీర్ బాబు కొడుకు చరిత్‌ను కూడా సినిమాల్లోకి తీసుకురావడం పక్కగానే కనిపిస్తోందిమెగా స్టార్ ఫామిలీ కి ధీటుగా సూపర్ స్టార్ ఫ్యామిలీ తెలుగు తెరపై మెరవనున్నారుసో రాబోయే నూతన నటులకు అల్ ది బెస్ట్ చెబుదామా !

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news