Movies" NEXT ఏంటి " ఆఫీషియల్ టీజర్..

” NEXT ఏంటి ” ఆఫీషియల్ టీజర్..

యువ హీరోల్లో ఏమాత్రం ఫాం లో లేని సందీప్ కిషన్ హీరోగా హీరోయిన్ గా స్టార్స్ పక్కన నటించి ప్రస్తుతం కెరియర్ అగమ్యగోచరంగా ఉన్న తమన్నా కలిసి చేసిన సినిమా నెక్ష్ట్ ఏంటి. కునాల్ కొహ్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. ఈ సినిమా టీజర్ చూస్తే ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది.

సందీప్ కిషన్, తమన్నా తొలిసారి కలిసి నటించిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ కు కావాల్సిన హాట్ సీన్స్ ఉండేలా జాగ్రత్త పడ్డారు దర్శకుడు కునాల్ కొహ్లి. ఇక సందీప్ కిషన్ కూడా కెరియర్ లో మొదటిసారి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమా చేశాడని చెప్పొచ్చు. సినిమాలో లిప్ లాక్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో ఫనా, హం తుం సినిమాలను డైరెక్ట్ చేసిన కునాల్ కొహ్లి తెలుగులో చేసిన మొదటి ప్రయత్నం నెక్స్ట్ ఏంటి. మరి హిట్ కోసం తపిస్తున్న సందీప్ కిషన్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news