విజయ్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్…! నిజాలు బయటపెట్టిన సెల్ఫీ వీడియో

comedian vijay new

తెలుగు కమెడియన్ విజయ్ సాయి యూసుఫ్ గూడలోని నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తన భార్య వనిత వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డాడని అందరూ భావించారు. అయితే, ఈ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. భార్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు విజయ్ ను వేధించినట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు విజయ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తన భార్య నుంచి తాను మూడు సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నానని, యూసుఫ్ గూడలో ఉంటుండగా, తన భార్య మణికొండలో ఉంటోందని విజయ్ చెప్పాడు. కొంత కాలం క్రితమే విడాకుల కోసం తన భార్య కోర్టులో పిటిషన్ వేసిందని, భరణం కూడా కోరిందని తెలిపాడు. ఈ రెండు కేసుల నుంచి బయటపడాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని చెప్పాడు. మూడు కోట్ల వరకు డిమాండ్ చేసిందని ఆ వీడియోలో విజయ్ చెప్పాడు. ఈ వ్యవహారానికి సంబంధించి శశిధర్ అనే వ్యక్తితో పాటు అడ్వొకేట్లు వేధింపులకు పాల్పడ్డారని చెప్పాడు. ఈ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వీడియోలో విజయ్ స్ప్రష్టం చేసాడు.

కాగా వనితా రెడ్డి వాదన మరోలా ఉంది. తన భర్త ఆత్మహత్యపై అనుమానాలున్నాయని అన్నారు. తాను విజయ్ ను బెదిరించలేదన్నారు. తామిద్దరం రెండేళ్లుగా విడిపోయి బతుకుతున్నామని ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రెండేళ్లుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తోందన్నారు. విజయ్ కు వేరే అమ్మాయితో సంబంధం ఉందని, ఇపుడు ఆమెను కూడా వదిలేశాడని చెప్పారు. తనను విజయ్ ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడని, వాటి గురించి తాను ఎప్పుడూ బయట చెప్పుకోలేదని తెలిపారు. విజయ కి అతని తండ్రితో ఆస్తి తగాదాలు ఉన్నాయని బహుశా అందుకే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని వనిత చెప్పుకొస్తోంది.

Leave a comment