Movies‘నేను లోకల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు.. చాలాకాలం తర్వాత సెకండ్...

‘నేను లోకల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు.. చాలాకాలం తర్వాత సెకండ్ ప్లేస్ కొట్టేసిన నాని

Nantural star Nani’s latest film Nenu Local first day collections of Telugu states have been released by trade reports. According to their estimates, this is the second highest film for Nani after Eega.

ఈ శుక్రవారం (03-02-2017) ‘నేను లోకల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నేచురల్ నాని.. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేశాడు. చాలాకాలం నుంచి డీసెంట్ ఓపెనింగ్స్ మాత్రమే రాబడుతున్న ఈ హీరో.. ఈ చిత్రంతో ప్రభంజనం సృష్టించాడు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఈగ’ సినిమా రేంజులో కలెక్షన్ల వర్షం కురిపించాడు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ మూవీ మొదటి రోజు రూ. 4.35 కోట్లు కలెక్ట్ చేసింది. నాని కెరీర్‌లో ‘ఈగ’ (రూ.4.60) తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టింది ఈ చిత్రమే. నాని వరుసగా విజయాలు అందుకుంటున్నాడు కానీ.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకోవడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. వరుసగా ఐదు విజయాలు అందుకున్న తర్వాత నాని చేసిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ముందుగానే బుకింగ్ చేసుకోవడం, అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ రావడం వల్లే ఈ చిత్రం ఇలా కలెక్షన్ల సునామీ సృష్టించింది.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. దిల్‌రాజు సంగీతం సమకూర్చిన ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇందులో నవీన్ చంద్ర ఓ కీలకపాత్ర పోషించాడు.

ఏరియాల వారీగా ఫస్ట్ డే కలెక్షన్స్ :
నైజాం : 1.56 కోట్లు
సీడెడ్ : 55 లక్షలు
ఉత్తరాంధ్ర : 51 లక్షలు
గుంటూరు : 41 లక్షలు
ఈస్ట్ గోదావరి : 55 లక్షలు
వెస్ట్ గోదావరి : 30.5 లక్షలు
కృష్ణా : 28.5 లక్షలు
నెల్లూరు : 18 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 4.35 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news