లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ” నేనేం చేశానో ” సాంగ్..!

123

ఆర్జివి డైరెక్ట్ చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ చేశారు. సినిమాలో అత్యంత కీలకమైన లక్ష్మి పార్వతి, ఎన్.టి.ఆర్ ల మధ్య ఏర్పడిన బంధాన్ని చూపిస్తూ ఎమోషనల్ గా ఈ పాట సాగుతుంది. నేనే చేశానో అంటూ పాట వస్తుంది. ఎన్నికల టైంలో టిడిపి వ్యతిరేకత వస్తుందని తెలిసి.. ఈ సినిమాను అడ్డుకునేందుకు టిడిపి శ్రేణులు గట్టి ప్రయత్నాలు చేశారు.

కాని వర్మ పంతమే నెగ్గింది. సినిమా అనుకున్న విధంగా మార్చి 29 శుక్రవారం రిలీజ్ అవుతుంది. రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందించగా సిరా శ్రీ సాహిత్యం అందించారు. రిలీజ్ ముందు ఎన్నో సంచలనాలు సృష్టించిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment