టైటిల్ కు తగ్గట్టుగానే ట్రైలర్.. నేలట్టికెట్టు మాస్ రాజా కుమ్మేస్తాడా..!

టైటిల్ కు తగ్గట్టుగానే ట్రైలర్.. నేలట్టికెట్టు మాస్ రాజా కుమ్మేస్తాడా..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టి హ్యాట్రిక్ హిట్ కు సిద్ధమైన కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేలటిక్కెట్టు. రాం తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. కొద్దిగంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ముఖ్యంగా రవితేజ లుక్స్ పరంగా సినిమాలో చాలా బాగున్నాడు. తన ఫ్యాన్స్ తనని ఎలా చూడాలనుకుంటున్నాడో అలాంటి కథతోనే వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇందులో డైలాగ్స్ కూడా కళ్యాణ్ కృష్ణ తన పెన్ పవర్ చూపించాడని చెప్పొచ్చు. ‘చుట్టూ జనం.. మధ్యలో మనం..’ ‘ముసలితనం అంటే చేతకాని తనం కాదు నిలువెత్తు అనుభవం’ అన్న డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి.

సినిమా కాన్సెప్ట్ కొత్తగా కాకపోయినా కచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే సినిమాగా వస్తుందని చెప్పొచ్చు. శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తున్నాయి. మే 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మాస్ రాజా మార్క్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Leave a comment