నేల టిక్కెట్టు : రివ్యూ & రేటింగ్

nela-ticket-review-and-rating

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా నేల టిక్కెట్టు. ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్ లో రాం తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. శక్తికాంత్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకులముందుకు వస్తుంది. సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో జగపతిబాబు దుర్మార్గుడిగా మారుతాడు. ఎంతగా అంటే చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికి అన్యాయం చేస్తుంటాడు. అయితే ఇదే టైంలో హీరో ప్రతి ఒక్కతికి సాయం చేసుకుంటూ వెళ్తుంటాడు. విలన్ గురించి తెలుసుకుని అతని చేసే అన్యాయాలకు బుద్ధి చెప్పాలని చూస్తాడు. ఈ క్రమంలో హీరోకి అతనెవరో తెలుస్తుంది. హీరో విలన్ల మధ్య ఫైట్. చివరగా విలన్ ను హీరో ఏం చేశాడు అన్నదే సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

మాస్ మహరాజ్ రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సమాజం మీద ప్రేమ బాధ్యత ఉన్న కుర్రాడిగా ఈ సినిమాలో చాలా మంచి పాత్రలో కనిపించాడు. ఇక జగపతిబాబు కూడా విలన్ గా తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. మాళవిక శర్మ అటు అందం ఇటు అభినయం రెండిటిలో మెప్పించింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ పర్వాలేదు.. కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ శక్తికాణ్ అంత గొప్ప మ్యూజిక్ ఇవ్వలేదు. రెండు సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, కథనాలు కొత్తగా అనిపించవు.. రొటీన్ గా సాగే కథనం రెగ్యులర్ గా వినిపించే కథ కావడంతో దర్శకుడు ఎక్కడా తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. ఎడిటింగ్ కూడా అంతగా బాగాలేదు. డైలాగ్స్ అక్కడక్కడ బాగున్నాయి.

విశ్లేషణ :

రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరోని తీసుకుని ఓ చిన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కళ్యాణ్ కృష్ణ. హీరోని అనాథగా చూపిస్తూ వారు ఎలా పెరిగే అవకాశాలున్నాయో ప్రస్థావించాడు. ఇక సమాజానికి హాని చేసే విలన్లు హీరో కంట పడటం. అతని ఆటకట్టించేందుకు హీరో ప్లాన్స్ వేయడం అంతా తెలిసిందే.

సినిమా కథ పాతదే అయినా కథనంలో కొద్దిపాటి ఫన్ క్రియేట్ చేయగలిగాడు. కాని సినిమ నడవడానికి అది ఏమాత్రం సరిపోదు అన్న విషయం దర్శకుడు గుర్తించలేకపోయాడు. సినిమా స్క్రీన్ ప్లే ఆడియెన్స్ పేషెన్సీకి టెస్ట్ పెడుతుందని చెప్పొచ్చు కాలం చెల్లిన కథలను తెచ్చి కొద్దిపాటి ఫన్ యాడ్ చేసి వదిలితే ప్రేక్షకులు ఆమాత్రం గుర్తించలేరా చెప్పండి.

సినిమా అంతా రొటీన్ పంథాలో సాగడం.. ఏమాత్రం కొత్తదనం లేకపోవడం విసుగు తెప్పిస్తుంది. అంచనాలకు తగినట్టుగా కాదు కనీసం సినిమా టైం పాస్ గా అనిపించకపోవడం కొసమెరుపు. రాజా ది గ్రేట్ హిట్ కొట్టినా టచ్ చేసి చూడు తర్వాత రవితేజ నేలట్టిక్కెట్టు కూడా నిరాశ పరచిందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

రవితేజ

మాళవిక శర్మ

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ

కథనం

మ్యూజిక్

బాటం లైన్ :

నేలట్టిక్కెట్టు.. నిరాశపరచే ప్రయత్నమే..!

రేటింగ్ : 2/5

Leave a comment