దేవుడా.. ఇలాంటి పబ్లిక్ టాక్ ఏ సినిమాకు రాలేదు..!

nela-ticket-public-talk

మాస్ మహరాజ్ రవితేజ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్ లో వచ్చిన నేల టిక్కెట్టు సినిమా మొదటి షో పడింది. ఈ సినిమా చూసిన ఆడియెన్స్ రియాక్షన్ దారుణంగా ఉంది. సినిమా చెత్త అంటే చెత్త అనేస్తున్నారు. రవితేజ అసలు ఈ సినిమా ఎలా తీశాడని అంటున్నారు. ఈమధ్యన్ పబ్లిక్ ఫోరం లో స్టార్ హీరోలని టార్గెట్ చేయడం ఎక్కువైంది. ఇలాంటి టైం లో ఓ సినిమా గురించి ఇంత దారుణంగా ఎవరు మాట్లాడలేదు.

రవితేజ ఎనర్జీని వేస్ట్ చేసినందుకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణని తిడుతున్నారు. సినిమా ఏం తీశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. రవితేజ కెరియర్ లో ఈ రకంగా ఓపెన్ టాక్ రావడం అది కూడా ఇంత దారుణంగా పబ్లిక్ చెప్పడం కాస్త విచారకరమే. ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్ లో రాం తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది.

Leave a comment