“నేల టిక్కెట్టు” హిట్టా ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

nela-ticket-hit-or-flop

రవితేజ సినిమా అంటే మాస్ ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే. ఆడియెన్స్ కు కావాల్సిన అంశాలన్ని తన సినిమాలో ఉండేలా చూసుకుంటూ మాస్ రాజాగా అభిమానుల ప్రేమను గెలుచుకున్నాడు రవితేజ. రాజా ది గ్రేట్ హిట్ తర్వాత టచ్ చేసి చూడు నిరాశ పరచగా ఎన్నో భారీ అంచనాల మధ్య నేల టిక్కెట్టు రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేదని చెప్పొచ్చు.

సినిమా చూస్తున్నంతసేపు ఏదో పాత సినిమా చూస్తున్నాం అన్న భావన కలుగుతుంది తప్ప కొత్త సినిమా అన్నదే ఉండదు. కథనం చాలా నీరసంగా సాగుతుంది. కేవలం అక్కడక్కడ కామెడీ ఎంటర్టైన్ చేసింది తప్ప సినిమా ఎక్కడ ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పొచ్చు. రవితేజ లాంటి ఎనర్జీ ఉన్న హీరో దొరికితే ఏ రేంజ్ లో సినిమా తీయొచ్చో ఆ అంచనాలను అందుకోలేకపోయాడు కళ్యాణ్ కృష్ణ.

నిజాయితీ కలిగిన హీరో.. అనాథలను, వృద్ధులను రక్షించాలనుకోవడం దానికి ఓ పొలిటిషియల్ విలన్ అయ్యి అడ్డుపడటం ఇలా ఈ కథతో చాలా సినిమాలొచ్చాయి. హీరోయిన్ మాళవిక శర్మ స్కిన్ షో ఆకట్టుకోలేదు. సినిమాలో ప్లస్సుల విషయానిఒస్తే రవితేజ నటన, మాళవిక శర్మ అందాలు, కెమెరా వర్క్ కాస్త బాగుంది.

ఇక మైనస్సులయితే మ్యూజిక్ ఇంకా బాగా రావాల్సింది. కథ, కథనలాలైతే ఏమాత్రం ఆకట్టుకోలేదు. రెండు వరుస సక్సెస్ లను అందుకున్న కళ్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ మిస్ అయ్యాడని చెప్పొచ్చు

Leave a comment