రవితేజ దెబ్బకి.. సినిమా టికెట్స్ అమ్ముతున్న డైరెక్టర్, హీరోయిన్

nela-ticket

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. ఎస్.ఆర్.టి బ్యానర్ లో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. శక్తికాంత్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా రిలీజ్ అవుతున్న హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ లో డైరెక్ట్ గా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ, హీరోయిన్ మాళవిక శర్మలే సినిమా టికెట్స్ సేల్ చేస్తారట. సినిమాపై పబ్లిక్ ఒపీనియన్ తో పాటుగా పబ్లిక్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసం ఇలా సెట్ చేశారని తెలుస్తుంది.

రవితేజ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ఈ వింతైన ప్రమోషన్స్ సినిమాపై మరింత క్రేజ్ తెస్తున్నాయి. రేపు అనగా మే 24న సాయంత్రం హైదరాబాద్ సంధ్య థియేటర్‌కి వచ్చి అక్కడ సాయంత్రం 4 గంటల నుండి 4:30 గంటల వరకు నేలటిక్కెట్టు దర్శకుడు, హీరోయిన్ ఈ సినిమా టికెట్లు అమ్ముతారట. మరి వారి చేతులతో డైరెక్ట్ గా సినిమా టికెట్ తీసుకునే లక్కీ ఛాన్స్ మీకే రవొచ్చు మీరు ట్రై చేయండి.

Leave a comment