Moviesఆది పినిశెట్టి 'నీవెవరో' రివ్యూ & రేటింగ్

ఆది పినిశెట్టి ‘నీవెవరో’ రివ్యూ & రేటింగ్

దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడిగా ఆది పినిశెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఆది ఈమధ్య విలన్ గా కూడా మారాడు. లేటెస్ట్ గా తాను సోలో హీరోగా ప్రయత్నించిన సినిమా నీవెవరో. ఆది సరసన తాప్సీ, రితిక సింగ్ నటించిన ఈ సినిమా కోనా వెంకట్ నిర్మాణంలో వచ్చింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

బ్లైండ్ చెఫ్ గా పనిచేస్తున్న కళ్యాణ్ (ఆది పినిశెట్టి)కి అను (రితిక సింగ్) స్నేహితురాలు ఉంటుంది. రైటర్ అయిన అను కళ్యాణ్ ను ప్రేమగా చూసుకుంటుంది. మరోపక్క తన చుట్టుపక్కల వారికి ఎంతో సహాయపడే వెన్నెల (తాప్సీ) కళ్యాణ్ కు పరిచయం అవుతుంది. ఈ టైంలో ఓ యాక్సిడెంట్ కళ్యాణ్ జీవితాన్ని మార్చేస్తుంది. వెన్నెల ఫ్యామిలీ కష్టాలను తీర్చేందుకు కళ్యాణ్ ప్రయత్నిస్తాడు. వెన్నెల ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో తెలుసుకునే క్రమంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు కళ్యాణ్. ఇంతకీ వెన్నెల ఫ్యామిలీకి ఏమైంది..? వెన్నెల కోసం కళ్యాణ్ ఏం చేశాడు..? చివరకు కథ ఎలా ముగుసింది అన్నది తెర మీద చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

ఆది పినిశెట్టి డిఫరెంట్ రోల్ ట్రై చేశాడు. సినిమాలో కొంత భాగం బ్లైండ్ గా నటించి మెప్పించాడు. తాప్సీ ఎప్పటిలానే ఆకట్టుకుందు. రితిక సింగ్ కూడా గురు తర్వాత తెలుగు తెర మీద మెరిసింది. తన పాత్ర వరకు ఆమె బాగానే చేసింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

శ్రీ సాయిరాం సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ఇన్వెస్టిగేటివ్ సీన్స్ ను క్యాచీగా తీశాడు. జిబ్రాన్ మ్యూజిక్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే కాని పాటలు మెప్పించలేదు. హరినాథ్ డైరక్షన్ మెప్పించలేదని చెప్పాలి. కథ, కథనాలు కొత్తగా అనిపించవు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన నీవెవరో సినిమా అంచనాలను అందుకోలేదని చెప్పాలి. సినిమా చాలా సాగదీతగా అనిపిస్తుంది. కథ, కథనాలు ప్రేక్షకులు ఊహించేలా ఉన్నాయి. ముఖ్యంగా రొటీన్ గా కథనం సాగించిన తీరు మెప్పించలేదు. ఆర్టిస్టులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

వెన్నెల కిశోర్ కామెడీ కొద్దిపాటి నవ్వులు తెప్పిస్తుంది. అయితే థ్రిల్లర్ అంశాలకు కావాల్సిన సబ్జెక్ట్ ఏమి లేదని అనిపిస్తుంది. కథను రాసుకున్న తీరు బాగున్నా దాన్ని అనుకున్నట్టుగా తెరకెక్కించలేదని చెప్పొచ్చు. సినిమాలో ఆది నటనకు మంచి మార్కులు పడతాయి.

సినిమా మొదటి భాగం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించినా సెకండ్ హాఫ్ బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. కథనం గ్రిప్పింగ్ గా రాసుకోవడంలో విఫలమయ్యాడు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్ :

ఆది

సినిమాటోగ్రఫీ

కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే

స్లో నరేషన్

బాటం లైన్ :

నీవెవరో ఆది ప్రయత్నం ఫలించలేదు..!

రేటింగ్ : 2.25/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news