Reviews"నీది నాది ఒకే కథ" రివ్యూ రేటింగ్ : బుర్రలేని వాళ్లు...

“నీది నాది ఒకే కథ” రివ్యూ రేటింగ్ : బుర్రలేని వాళ్లు బుర్ర పెట్టేలా చేస్తుంది..!

అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో హీరోగా కొత్త టర్న్ తీసుకున్న శ్రీవిష్ణు వేణు ఊడుగుల డైరక్షన్ లో చేసిన సినిమా నీది నాది ఒకే కథ. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

చదువంటే భారంగా భావించే సాగర్ (శ్రీ విష్ణు) చిన్నప్పటి నుండి తండ్రి అంచనాలకు దూరంగా ఉంటాడు. హీరో ఫాదర్ (దేవి ప్రసాద్) ఓ టీచర్ అయ్యుండి తన కొడుకుని చదువు మీద ఆసక్తి కలిగించేలా చేయడంలో విఫలమవుతాడు. ఇక ఈ క్రమంలో హీరోకి తండ్రికి గొడవలవుతాయి. ఇంతలోనే శ్రీ విష్ణుకి హీరోయిన్ సత్నా టైటస్ పరిచయం అవుతుంది. హీరోకి కావాల్సిన సపోర్ట్ ఇస్తుంది ఆమె. ఇంతకీ తండ్రి మనసు గెలవాలనుకున్న హీరో అది సాధించాడా..? చదువు రాకుండా అతను ఏం నేర్చుకున్నాడు..? కథ ఎలా ముగిసింది అన్నది తెర మీద చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

సాగర్ గా మరోసారి శ్రీ విష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం అతని పాత్ర మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి శ్రీ విష్ణు అందుకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. సత్నా టైటస్ కూడా బాగానే చేసింది. ఇద్దరి మధ్య కెమిస్టీ కుదిరింది. పొసాని పాత్ర కొద్దిసేపే అయినా అలరించింది. ఇక హీరో తండ్రిగా నటించిన దేవి ప్రసాద్ కూడా ముఖ్య పాత్ర చేశాడు. సినిమా త్రూ అవుట్ తను ఉంటాడు. నారా రోహిత్ సర్ ప్రైక్ ఎంట్రీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

సురేష్ బొబ్బులి మ్యూజిక్ సినిమా ఫీల్ కు దగ్గరగా అనిపించింది. మ్యూజిక్ బాగుంది. రాజ్ తోటా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా ఫీల్ కు తగినట్టు కలరింగ్ తో అలరించారు. ఇక డైరక్టర్ వేణు మొదటి సినిమానే అయినా తను చెప్పదలచుకున్న పాయింట్ ఎక్కడ కన్ ఫ్యూజ్ లేకుండా చెప్పేశాడు. దర్శకుడి ప్రతిభ మెచ్చుకునేలా ఈ సినిమా ఉంటుంది. డైలాగ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ స్నిమా ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు.

విశ్లేషణ :

చదువు రాని ఓ స్టూడెంట్ ఎన్ని కష్టాలు పడతాడో చూపించే సినిమా ఇది. తండ్రి టీచర్ అయ్యుంటే ఇంకా ఆ కష్టాలు ఎలా ఉంటాయో చూపించారు. ప్రతి ఒక్క సన్నివేశం చాలా ఎమోషనల్ గా తెరకెక్కించారు. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య సీన్స్ చాలా చోట్ల మనసుకి హత్తుకుంటాయి. కథ, కథనాలు కూడా కొత్తగా ఉంటాయి.

కథ ఎలాగు కొత్తగా సినిమా క్యారక్టరైజేషన్ మీద ఎక్కువ నడిచిందన్న భావన వస్తుంది. సినిమా ఎంచుకున్న కథతో పాటు గా కథనం కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా లాగించాడు. కేవలం 121 నిమిషాల డ్యూరేషన్ కూడా ఈ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా చదువు రాని వాళ్ల భావజాలాన్ని బాగా అర్ధం చేసుకుని మరి ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు వేణు.

అయితే సినిమా ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే అంశాలున్నా.. ప్రాపొర్ వేలోనే ఉందా అన్నది ఆడియెన్స్ చూశాక రెస్పాన్స్ ఇస్తారు. ఒకవేళ కనెక్ట్ అయితే కనుక ఇది తప్పకుండా చిన్న సినిమాల్లో మరో సంచలనం అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడదగ్గ సినిమా ఇది.

ప్లస్ పాయింట్స్ :

శ్రీ విష్ణు

స్క్రీన్ ప్లే

డైరక్షన్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ ల్యాగ్ అవడం

బాటం లైన్ :

నీదీ నాదీ ఒకే కథ.. బుర్రలేని వాళ్లు బుర్ర పెట్టేలా చేస్తుంది..!

రేటింగ్ : 3.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news