ఏ.ఆర్.రెహ్మాన్ మహేష్ బాబు బాటలో నయనతార..

Nayanthara

న‌య‌న తార ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు

తెలుగు త‌మిళ భాష‌ల్లో త‌నదైన గుర్తింపు తెచ్చుకున్న న‌టి

కొన్ని సంద‌ర్భాల్లో వివాదాల్లో చిక్కుకుంది..

తాజాగా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాజ‌స్థాన్ కు వెళ్లిన ఆమె

అక్క‌డ ఉన్న ఓ ప్ర‌ముఖ ద‌ర్గాను ద‌ర్శించుకుంది. అదీ సాధార‌ణ భ‌క్తురాలిగా

వెళ్లి ఎవ్వ‌రినీ ఇబ్బంది క‌ల‌గ నీయ‌క ప్రార్థ‌న‌లు చేసి వ‌చ్చింది.

ఆమె పేరు డయానా కురియన్.. సినిమాల్లోకి వచ్చాక నయనతార అని పేరు మార్చుకుంది. పుట్టుక‌తో క్రీస్టియ‌న్ అయిన‌ప్ప‌టికీ  హిందూ మతం  స్వీకరించింది.ప్రస్తుతం ఈమె రాజస్థాన్లో.. ధృవ సినిమా ఒరిజినల్ డైరక్టర్ జయం మోహన్ రాజా తీస్తున్న ‘వైలైక్కరన్’ షూటింగులో బిజీగా ఉంది.

ఆ సమయంలో కాస్త టైమ్ దొరకడంతో.. అమ్మడు తన స్టయిలిష్ట్ తో కలసి దగ్గర్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను దర్శించుకుంది. అక్కడే ఓ ఫొటో కూడా దిగింది. గ‌తంలో ఇదే దర్గాని అనేక మార్లు ఏ.ఆర్.రెహ్మాన్.. వివి వినాయక్.. మహేష్ బాబు వంటి స్టార్లు సంద‌ర్శించుకున్నారు.కానీ నయనతార మాత్రం.. ఒక సాధారణ వ్యక్తిగా అక్కడికి వెళ్లి వ‌చ్చింది.

Leave a comment