నల్ల హీరో ప్రేమలో నయన్.. రోజుకో మిలియన్

nayanthara-movie-details

ప్రస్తుతం ఎక్కడ చూసినా కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు నయన్ తో చేసిన లవ్ ప్రపోజల్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నయనతార లాంటి అందగత్తెకు యోగి బాబు లాంటి కమెడియన్ టెక్కు కొడుతుండటం ఈ పాటకు హైలెట్ గా నిలిచింది. ఈ వీడియో రిలీజ్ అయిన నాటి నుండి ఇప్పటివరకు 76 లక్షల వ్యూయర్ కౌంట్ సాధించడం విశేషం.

ఇందులో నయనతారని చూసేందుకు కన్నా యోగి బాబు ఎక్స్ ప్రెషన్స్ చూసేందుకు ఈ వీడియోని తరచు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కూడా దీనికి సపోర్ట్ గా నిలిచింది. కళ్యాణ వయసు పాట ప్రస్తుతం అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కోకో సినిమాలో ఈ పాట కమెడియన్ యోగి బాబుకి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుంది.

ఇక నయనతార గురించి ఏం చెప్పగలం.. ఆమె ఏం చేసినా అదో అద్భుతం. ఈమధ్యనే కర్తవ్యం సినిమాతో వచ్చి అదరగొట్టిన నయనతార ఈ పాటలో చాలా అందంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈ పాట నయన్ కూల్ లుక్ ఆమె అభిమానులను ఇంప్రెస్ చేస్తుంది.

Leave a comment