Gossipsనిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న నయనతార..!

నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న నయనతార..!

సౌత్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే కచ్చితంగా నయనతార పేరు చెప్పాల్సిందే. తెలుగులో అనుష్క ప్రయోగాలు చేస్తున్నా ఒకటి హిట్టు మరోటి ఫ్లాప్ అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి. కాని తమిళంలో నయన్ చేస్తున్న సినిమాలు మాత్రం ఏ ఒక్కటి నిరాశపరచదు. స్టార్ సినిమాలకు ధీటుగా నయన్ లీడ్ రోల్ చేసిన సినిమాలు వసూళ్లు సాధిస్తాయని చెప్పొచ్చు.

చేస్తున్న సినిమాలు.. వస్తున్న ఫలితాలు ఆమెను లేడీ సూపర్ స్టార్ ను చేశాయి. ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలకు పైగా ఉన్న నయన్ ఈమధ్య ఓ దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పిందట. ఇక నిర్మాత రెమ్యునరేషన్ అడిగితే మైండ్ బ్లాక్ అయ్యే ఫిగర్ చెప్పిందట. ఏకంగ 5.5 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పిందట నయనతార. హిట్లైతే వస్తున్నా తన రెమ్యునరేషన్ తో మాత్రం నిర్మాతలను నయనతార భయపెడుతుందని కోలీవుడ్ టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news