Gossipsమణిరత్నం " నవాబ్ " రివ్యూ & రేటింగ్

మణిరత్నం ” నవాబ్ ” రివ్యూ & రేటింగ్

సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన మణిరత్నం డైరక్షన్ లో వచ్చిన సినిమా చెక్క చివంత వానం. తెలుగులో నవాబ్ గా రిలీజ్ అయ్యింది. శింభు, అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్, జ్యోతిక ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

నేర చరిత్ర కలిగిన సేనాపతి (ప్రకాశ్ రాజ్) తన ముగ్గురు కొడుకులతో జీవితాన్ని గడుపుతుంటాడు. తండ్రి తర్వాత ఆ సింహాసనం తమదే అన్నట్టుగా పెద్ద కొడుకు వర్ధాన్ (అరవింద్ స్వామి), రెండో కొడుకు అర్జున్ విజయ్ (త్యాగీ), మూడవ వాడు ఎతి (శింభు) ముగ్గురు తండ్రి తర్వాత తమదే వారసత్వంలా ఫీల్ అవుతుంటారు. అయితే గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతున్న వర్ధన్ కు వైఫ్ చిత్ర (జ్యోతిక) కాకుండా పార్వతి (అదితి రావు)తో రిలేషన్ కలిగి ఉంటాడు. ఇంతలోనే తండ్రి చనిపోవడంతో సింహాసనం ఎక్కాలని బ్రదర్స్ ముగ్గురు వారిలో వారే గొడవపడుతుంటారు. ఈ క్రమంలో వర్ధన్ స్నేహితుడిగా రసూల్ (విజయ్ సేతుపతి) మంచిగా నటిస్తూ ముగ్గురు బ్రదర్స్ ను టార్గెట్ చేస్తాడు. ఫైనల్ గా ఈ అన్నదమ్మూలు ఎలా నిజం తెలుసుకున్నారు. ఎలా కలిసారు అన్నదే సినిమా కథ.
10
నటీనటుల ప్రతిభ :

మణిరత్నం సినిమాలో పాత్రదారుల కన్నా పాత్రలే ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. అలానే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారని చెప్పొచ్చు. అరవింద స్వామి, శింభు, త్యాగీ వారి వారి పాత్రల్లో అదరగొట్టారు. జ్యోతిక, అదితి రావు, ఐశ్వర్య రాజేష్ మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జయసుధ పాత్రలు అలరించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ప్రతిది డీటైల్డ్ గా చూపించారు. రెహమాన్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తుంది. సినిమా బిజిఎం కూడా అదిరిపోయింది. కథ, కథనాల్లో దర్శకుడు మణిరత్నం తన మార్క్ చూపించలేకపోయాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా రన్ టైం సినిమాకు మైనస్ అయ్యిందని చెప్పొచ్చు.
11
విశ్లేషణ :

దర్శకులలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న మణిరత్నం కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేక వెనుకపడ్డాడు. అయితే తన సత్తా చాటేలా వచ్చిన సినిమా నవాబ్. సింహాసనం కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన కథే ఈ నవాబ్. ఎంచుకున్న కథ దానికి రాసుకున్న కథనం చాలా చక్కగా కుదిరాయి. సినిమాలో అక్కడక్కడ మణిరత్నం మార్క్ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది.

కమర్షియల్ అంశాలను మేళవించే క్రమంలో తన మార్క్ మిస్ చేశాడు మణిరత్నం. అయినా సరే సినిమా అంతా ట్విస్టులతో సాగించాడు. సినిమాలో కొన్ని సీన్స్ అదిరిపోయాయి. నవాబ్ ఓ మంచి ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వీకెండ్ పర్ఫెక్ట్ వాచబుల్ సినిమాగా నవాబ్ అందరి మనసులను గెలుస్తుందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

కాస్టింగ్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ మణి మ్యాజిక్

రన్ టైం

బాటం లైన్ :

మణిరత్నం ‘నవాబ్’.. రేసులో గెలిచాడు..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news