Newsఎన్టీఆర్ కన్నా బాగా చేస్తా.. నాచురల్ స్టార్ నాని..!

ఎన్టీఆర్ కన్నా బాగా చేస్తా.. నాచురల్ స్టార్ నాని..!

జూన్ 10 నుండి బిగ్ బాస్ రియాలిటీ షో మొదలవుతుంది. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. ఇక ఈ సీజన్ కు నానిని హోస్ట్ గా సెలెక్ట్ చేశారు. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ సూపర్ హిట్ చేశాడు. అయితే ఈసారి నాని ఎలా ఈ షోని నడిపిస్తాడు అన్నదే ప్రతి ఒక్కరి డౌట్. ఇక దీనికి సమాధానంగా నాని ఈ సీజన్ కూడా అదిరిపోద్ది అంటున్నాడు.

ఎక్కడ విన్నా సరే తారక్ హోస్టింగ్ అదరగొట్టాడని అంటున్నారు. అయితే స్టార్ మా వారిని అడిగి మరి ఆ వీడియోలు తెప్పించుకున్నా తారక్ షోని చూడలేదు. కాని ఈసారి మరింత సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్, గేమ్ ప్లాన్స్ తనని ఎట్రాక్ట్ చేశాయి. అందుకే ఈ సీజన్ తాను చేయాలనుకున్నానని చెప్పాడు నాని. చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ గేమ్ ప్లాన్ సరికొత్తగా హౌజ్ లో ఉన్న వారికే కాదు ఆడియెన్స్ ను థ్రిల్ కలిగించడం ఖాయమని తెలుస్తుంది.

నాని మాత్రం ఇప్పుడు సీజన్ 1 తారక్ గురించి ఎలా మాట్లాడుతున్నారో సీజన్ 3లో తన గురించి అలానే మాట్లాడుతారని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. మరి నాని బుల్లితెర ఆడియెన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news