Politicsపాలసంద్రం.. పాతాళం మధ్యలో మోదీ!!

పాలసంద్రం.. పాతాళం మధ్యలో మోదీ!!

Narendra Modi may face either hell or heaven with Demonetization effect. The common man thinking positively about modi’s demonetization decision.If anything goes wrong or right people may express their decision with vote.

ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో మొత్తం దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకువచ్చారు. ఒక్కతాటిపైకి తీసుకువచ్చారు అంటే అదేదో అనుకునేరు కేవలం క్యులో నిలబడేలా చేశారు అనే ఉద్దేశంలో అన్నాను. ఇక మోదీ పెద్దనోట్లను రద్దు చేసి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవాలంటే సవాలక్ష కండీషన్స్ విధించారు. అయితే దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు మోదీ చేస్తున్న ప్రయోగాలకు తాము తాత్కాలికంగా ఇబ్బందిపడ్డాగానీ శాశ్వాతంగా నల్లధనం రూపులేకుండా, అందరికి అభివృద్ధి ఫలాలు అందుతాయి అని సామాన్యులు కూడా భావిస్తున్నారు. అందుకే ఎన్ని గంటలైనా కానీ ఎంతో ఓపికతో ఎదురుచూస్తున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి భారీ మెజార్టీ కట్టబెట్టారు దేశ ప్రజానీకం. మోదీని తిరుగులేని మెజార్టీతో ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. ఫుల్ ఎనర్జీతో మోదీ అధికారపగ్గాలు చేపట్టారు. అయితే రెండున్నర సంవత్సరాలుగా తన మార్క్ పథకాలతో దూసుకెళుతున్నారు. అయితే తాజాగా మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ప్రభావం చూపించేలా పెద్దనోట్ల రద్దును అమలు చేశారు. దేశంలో చలామణిలో ఉన్న పెద్దనోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8, 2016నాడు రాత్రి 8గంటలకు ప్రకటన విడుదల చేశారు. దేశంలో నల్లధనాన్ని నివారించడానికి మోదీ చేస్తున్న అతిపెద్ద ప్రయోగంగా దీన్ని భావిస్తున్నారు.

నిజానికి మోదీ తీసుకువచ్చిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల నల్లధనం పోగేసుకున్న కుబేరులంతా బ్యాంకుల ముందు తమతోపాటు క్యులో నిల్చుని, డబ్బులు డ్రా చేసుకోవడానికి వస్తారని అందరూ ఊహించారు. కానీ నిజానికి అలా జరగలేదు. సామాన్యుడే తిరిగి కష్టాలుపడాల్సి వస్తుంది తప్పితే డబ్బున్న ఏ ఒక్కరు కూడా బ్యాంకు ముందు లైన్ లో నిల్చోలేదు అంటే డీమోనిటైజేషన్ ప్రభావం ఎలా ఉందో సామాన్యుడికి అర్థమవుతుంది. అయితే ఇప్పటికి మోదీని సామాన్యుడు సపోర్ట్ చేస్తున్నా కానీ ఓ దశ దాటిన తర్వాత మాత్రం పరిస్థితి అలా ఉండదు.

పెద్దనోట్ల రద్దు తర్వాత పనిమానుకొని, సామాన్యుడు బ్యాంకు ముందు క్యులో నిల్చున్నాడు. పెన్షన్ కోసం మాజీ ఉద్యోగులు కూడా క్యు లైన్లో నిల్చున్నారు. మోదీ నిర్ణయంతో అందరూ విభేదించక, చాలా మంది సపోర్ట్ చేశారు. వారి ప్రకారం మోదీ తీసుకున్న నిర్ణయం కేవలం తాత్కాలికంగా కష్టాలు తీసుకువచ్చేదే అయినా భవిష్యత్ తరాల కోసం తప్పదు అని అనుకుంటున్నారు. అయితే మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల సామాన్యుడికి నేరుగా లాభం చేకూరకపోయినా, దేశానికి మంచి జరిగింది అని అర్థమైతే మాత్రం మోదీకి పాలసంద్రంలో విష్ణుమూర్తిని ఎలా అయితే చూస్తారో జనాలు అలా చూస్తారు.

అధికారం చేతిలో ఉంది కదా అని, ప్రజలు ఎలాగూ తన వెంటే ఉన్నారు కదా అని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల పెద్దగా ప్రయోజనంలేదు, దేశానికి లాభం కాదు కదా నష్టం వచ్చింది అని తేలితే మాత్రం ప్రజలు అదే మోదీని పాతాళినికి తొక్కేస్తారు. గతంలో ఇందిరకు హారతలుపట్టిన అదే సామాన్యుడు ఆమె చేసిన ‘అతిచర్యలకు’ చివరకు ఎన్నికల టైంలో తొక్కేశారు. ఓట్ల కోసం వచ్చే టైంలోనే ఇందిరను ఎలాగైతే ఆడుకున్నారో మోదీకి కూడా అదే అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది. మరి మోదీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారం అయితే కాదు. కానీ మోదీ, దేశం భవిష్యత్తును మాత్రం సామాన్యుడు మార్చగలడు అన్నది మాత్రం వాస్తవం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news