శ్రీ రెడ్డి పై నాని భార్య అటాక్

sri-reddy-nani-wife

నాచురల్ స్టార్ నాని మీద శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కావాలని నానిని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తున్న శ్రీరెడ్డి మ్యాటర్ పై ఆల్రెడీ నాని కూడా స్పందించాడు. ఓపికకు ఓ లెక్క ఉంటుందని చెబుతూ ఆమె మీద లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యాడు. బిగ్ బాస్ లో ఆమెని రానివ్వకుండా చేసింది నానినే అంటూ శ్రీరెడ్డి కామెంట్స్ ఉన్నాయి. అంతేకాదు వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్నట్టుగా శ్రీరెడ్డి తన మాటల్లో చెబుతుంది.

ఇక ఈ వ్యవహారంపై నాని భార్య అంజనా కూడా స్పందించారు. దయాగుణాలు కలిగిన ఇండస్ట్రీలో ఒక్కోసారి వారి పబ్లిసిటీ కోసం వేరొకరి జీవితాలతో ఆడుకునే వారు ఇందులోకి వస్తుండటం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే వారు చేసే చెత్త కామెంట్లను ఎవరు పట్టించుకోరు.. ఒకరి మీద బురద చల్లే ప్రయత్నంలో వారి వ్యక్తిగత జీవితాన్ని దిగజార్చుకునేందుకు ఎలా సిద్ధ పడతారో అంటూ ట్వీట్ చేశారు అంజనా.

ఈ ట్వీట్ కచ్చితంగా శ్రీరెడ్డి గురించే అని అందరు ఊహించవచ్చు. మరి నాని తరపున తన భార్య అంజనా శ్రీరెడ్డిని ఎటాక్ చేయడం ఈ వ్యవహారాన్ని ఎంత దూరం తీసుకెళ్తుందో చూడాలి.

Leave a comment