తెర వెనుక చక్రం తిప్పుతూ దొరికిపోయిన నాని

nani

హీరో నాని ఇతడిని చూస్తే హీరో లా కనిపించడు. మన పక్కింటి కుర్రాడు, పెద్దగా హీరో లుక్స్ అద్భుతమైన ఫిజిక్ లేని ఓ సాధారణ జెంటిల్‌మెన్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు టాప్ హీరోలతో పోటాపోటీగా పేరు సంపాదించుకున్న యంగ్ హీరో. అయితే హీరోగా నటించి నటించి బోర్ కొట్టేసిందో ఏమోకానీ ఇప్పుడు నిర్మాతగా మారేందుకు సిద్దమైపోయాడు.
అప్పట్లో డీ ఫర్ దోపిడీ అనే సినిమా తీసిన నాని ఇప్పుడు మరొక సినిమా కోసం సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసేసాడు. ఈ సినిమా ఒక భారీ మల్టీ స్టారర్ అని అంటున్నారు. నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్ లతో ఒక పెద్ద చిత్రం మీదనే కన్నేశాడు. కానీ ఇంతమంది హీరో హీరోయిన్ లు ఉంటే ఒక ప్రతిష్టాత్మక కమర్షియల్ సినిమా అవ్వాలి కదా కానీ నానీ దీన్ని ఒక ప్రయోగాత్మక చిత్రంగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పనిచేసినవాళ్లంతా నామ మాత్రపు పారితోషికంతో సినిమా ఒప్పుకొన్నారని తెలుస్తోంది.

ఐతే ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది అదేంటంటే ఈ సినిమాలో మాత్రం నని కనిపించడు.
కేవలం ఒక నిర్మాత గా భాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ సినిమా పూర్తయ్యాకే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ చేయాలని నాని భావిస్తున్నాడు. ప్రమోషన్లు కూడా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు నాని. పెద్ద స్టార్లున్న ఈ చిన్న సినిమా గురించిన వివరాలు అతి త్వరలో తెలుస్తాయి. ఆ నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లు ఎవరన్నది కూడా ప్రస్తుతానికి మాత్రం బయటకి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు. నిర్మాతగా కూడా నాని సక్సెస్ కావాలని కోరుకుందాం!

Leave a comment