Gossipsవిజయ్ రూట్ లోనే వెళ్తున్న నాని.. అలా చేయక తప్పట్లేదు..!

విజయ్ రూట్ లోనే వెళ్తున్న నాని.. అలా చేయక తప్పట్లేదు..!

టాలీవుడ్ మొత్తం విజయ్ దేవరకొండ ఫీవర్ పట్టుకుందని చెప్పొచ్చు. ఎలా వచ్చాడో కాని మనోడు వచ్చిన ముహుర్తం చాలా స్ట్రాంగ్ అయ్యింది. ఎవడో సుబ్రమణ్యం సినిమాలో నాని పక్కన సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా ఈ సినిమాలన్ని అతన్ని స్టార్ ను చేశాయి. నాని పక్కన నటించిన ఈ హీరో ఇప్పుడు నానిని మించిపోయాడని చెప్పడంలో సందేహం లేదు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రష్మికతో ముద్దులాట సాగించాడు విజయ్. అయితే విజయ్ సక్సెస్ ఫార్ములా ఇదే అని నాచురల్ స్టార్ నాని కూడా తన సినిమాలో లిప్ లాక్ సీన్ ఉండేలా చూస్తున్నాడు. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న జెర్సీ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ తో నాని లిప్ లాక్ కానిచ్చాడు. సినిమా నుండి వచ్చిన మొదటి సింగిల్ అదేంటో గాని సాంగ్ లో లిప్ లాక్ ఉంది.

సో నాని హీరోగా మారాకా ఎన్నాళ్లకో వచ్చిన విజయ్ అతని రూట్ లో నానిని వచ్చేలా చేసుకున్నాడు. నాని జెర్సీ ఏప్రిల్ 19న రిలీజ్ అవనుంది. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. నాని ఇందులో క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఈమధ్యనే రిలీజైన టీజర్ ఇంప్రెస్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news