Gossipsబిగ్ బాస్ 3 నుండి నాని అవుట్..! రీజన్ ఇదే..?

బిగ్ బాస్ 3 నుండి నాని అవుట్..! రీజన్ ఇదే..?

వచ్చే ఏడాదిలో బిగ్ బాస్ సీజన్ ౩ మొదలుకాబోతున్నట్టు అందుకు తగిన ఏర్పాట్లు చేసేపనిలో బిజీగా ఉన్నారు ఆ షో నిర్వాకులు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2 పూర్తయిన సంగతి తెలిసిందే. 16 వారాల పాటు ఈ షోని హోస్ట్ చేశాడు నాని. మధ్యలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఫైనల్ వరకు షోని పూర్తి చేసి వెళ్లాడు. తాజాగా బిగ్ బాస్ టీమ్ సీజన్ ౩ ని కూడా హోస్ట్ చేయమని నాని వద్ద ప్రపోజల్ పెట్టిందట. కానీ నాని మాత్రం ఈ ఆఫర్ ని రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
1
దీనికి తగిన కారణాలు కూడా నాని ఇప్పుడు చెబుతున్నాడు. వారంలో ఒకరోజు హోస్టింగ్ కోసం కేటాయిస్తే చాలనుకొని సీజన్ 2కి హోస్ట్ గా చేయడానికి అంగీకరించాడట.
కానీ షోలో ఉన్న కంటెస్టెంట్స్ కి సలహాలు ఇవ్వడానికి, కరెక్ట్ జడ్జిమెంట్ చేయడానికి వారం మొత్తం షో ఫాలో అవ్వాల్సి వచ్చిందట. దీంతో బిగ్ బాస్ షో కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఎదురైందని నాని వెల్లడించాడు. అందుకే బిగ్ బాస్ 3 చేసేందుకు నాని వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ షో నిర్వాకులు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఆ షో ఎవరి చేతిలో పెడదామా అని స్టార్ హీరోల అపాయింట్మెంట్స్ కోసం ట్రై చేస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news