బిగ్ బాస్-2 నుండి నాని ఔట్..? ఎన్టీఆర్ రి-ఎంట్రీ..?

nani-out-from-bigboss-2

బిగ్ బాస్-2 నుండి నాచురల్ స్టార్ నాని ఎక్సిట్ అవుతున్నాడా అంటే అవుననే అంటున్నారు. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా మొదలుపెట్టిన ఈ బిగ్ బాస్ సీజన్ 1 అత్యద్భుతంగా ఫలితాన్ని అందుకోగా సీజన్ 1 అనుకున్న రేంజ్ లో లేదు. నాచురల్ స్టార్ నాని తన నాచురల్ యాంకరింగ్ తో అందరితో కలివిడిగా ఉంటాడు అనుకుంటే తనకు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం చదువుతున్నట్టుగా అనిపించాడు.

ఎన్.టి.ఆర్ లో ఉన్న ఈజ్, జోష్, ఎంటర్టైనింగ్ నాని హోస్టింగ్ లో కనిపించట్లేదు. అయితే మొదటి, రెండు వారాల్లోనే అది చెప్పలేం. ఆడియెన్స్ అభిప్రాయమే కాదు బిగ్ బాస్ నిర్వాహకులలో కూడా నాని హోస్టింగ్ మీద అసంతృప్తి ఏర్పడింది. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో తెలుగు మాత్రమే మాట్లాడాలి అలాంటిది హోస్ట్ గా నానినే తరచు ఇంగ్లీష్ మాట్లాడటం జరుగుతుంది.

అంతేకాదు నాని హోస్టింగ్ అవార్డ్ ఫంక్షన్ లో చేస్తున్నట్టుగా ఉందని చెబుతున్నారు. అందుకే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి బిగ్ బాస్ నుండి నానిని తీసేసి వేరే స్టార్ హీరోని ఈ షో నడిపించడానికి తీసుకుంటారని తెలుస్తుంది. నాని బదులు మళ్లీ ఎన్.టి.ఆర్ ఓకే అంటే తారక్ నే ఈ షోకి హోస్ట్ గా తీసుకుంటారని తెలుస్తుంది.

Leave a comment