అహ..నాని ఏమి ని జోరు….నాని నెక్స్ట్ మూవీ టైటిల్ అదుర్స్

nani next film title

నానీ బీబీఎం నానీ ఎంసీఎ ఔను ! ఈ రెండు సినిమాలు త‌రువాత నానీ ఏం చేస్తాడు. కృష్ణార్జున యుద్ధం పేరిట ఆన్ స్క్రీన్ వార్ ఒక‌టి తెర‌పైకి తెస్తాడు. దీని త‌రువాత కూడా మ‌రో సినిమాని లైన్ లో పెట్టాడు. వ‌రుస సినిమాలు చేస్తూ కెరియ‌ర్‌లో దూసుకుపోతున్న ఈ మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి త‌న విజ‌య యాత్ర‌కో కొన‌సాగింపును ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజా చిత్రం టైటిల్ డైరెక్ట‌ర్ ఇలా అంతా క‌న్ఫం అయిపోయారు.

పేరు చిత్ర‌ల‌హ‌రి. వినేందుకే చాలా కొత్త‌గా ఉంది క‌దా కాదు మ‌న‌కు బాగా అల‌వాటైన పేరు. దూర‌ద‌ర్శ‌న్ లో బాగా వినిపించిన పేరు. తిరుమ‌ల కిశోర్ డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అంతేనా నాగ్ తో కూడా క‌లిసి ఆయ‌నో సినిమాలో న‌టించినున్నాడు. వైజ‌యంతి మూవీస్ నిర్మాణంలో శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు.ఇక చిత్ర‌ల‌హ‌రి సినిమా విష‌యానికి వ‌స్తే వ‌చ్చే వేస‌విలో విడుద‌ల కానుంది.ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.ప్ర‌స్తుతం తిరుమ‌ల కిశోర్ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు.త్వ‌ర‌లో ఇది విడుద‌ల కానుంది.

Leave a comment