Gossipsబన్నీ వద్దు నాని బెటర్ అంటున్న డైరెక్టర్

బన్నీ వద్దు నాని బెటర్ అంటున్న డైరెక్టర్

ఇష్టం సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా మనంతో అందరిని అలరించిన దర్శకుడు విక్రం కుమార్. 24తో ప్రయోగాత్మక సినిమాతో కూడా పర్వాలేదు అనిపించిన విక్రం కుమార్ ప్రస్తుతం అక్కినేని యువ హీరో అఖిల్ తో హలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే బన్నితో సినిమా చేస్తాడని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్ కు కథ వినిపించాడట.

అయితే బన్ని సినిమా కన్నా నానితో సినిమా బెస్ట్ అనుకుంటున్నాడట. బన్ని సినిమా కోసం రెండేళ్ల దాకా వెయిట్ చేయాల్సిందిగా పరిస్థితులు కనబడుతున్నాయట. అందుకే బన్ని సినిమాను పక్కన పెట్టేసి నానితో సినిమాకు సిద్ధమవుతున్నాడట విక్రం కుమార్. నాని సినిమా కూడా కొత్త కథతో రాబోతుందట. ప్రస్తుతం చేస్తున్న హలో డిసెంబర్ లో రిలీజ్ అవుతుండగా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో నానితో సినిమా మొదలు పెడతాడని తెలుస్తుంది.

అప్పట్లో విక్రం మహేష్, చరణ్ లాంటి స్టార్స్ కు కథలు చెప్పాడని వార్తలు వచ్చాయి. మరి నానితో సినిమా తర్వాత వారిద్దరిలో ఎవరితో అయినా విక్రం సినిమా చేసే అవకాశం ఉందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news