Gossipsనానికి ఒక్కరు కాదు... ఐదుగురు కావాలట !

నానికి ఒక్కరు కాదు… ఐదుగురు కావాలట !

పక్కంటి కుర్రాడిలా అమాయకమైన పేస్ పెట్టుకుని ఉండే నాచురల్ హీరో నాని సినిమాలు ఆ రేంజ్ లోనే హిట్లు అందుకుంటూ ఉన్నాయి. వరుస వరుసగా వస్తున్న హిట్ సినిమాలతో నాని మంచి ఫామ్ లో ఉన్నాడు. చిన్న సినిమాలుగా వచ్చినా… పెద్ద హిట్ కొట్టడం నాని సినిమాల స్టైల్. ఇక విషయానికి వస్తే… మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా కోసం ఏకంగా ఐదుగురు హీరోయిన్లను తీసుకుంటున్నారు.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ నెలలోనే ఓ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు నాని. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకున్నారు. రెండో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ను, మూడో హీరోయిన్ గా ప్రియా వారియర్ ను తీసుకున్నారు.

ఇంకా నాలుగో హీరోయిన్, ఐదో హీరోయిన్ కూడా కావాలంట. ప్రస్తుతం వాళ్ల కోసం చిత్ర యూనిట్ వెతుకులాట మొదలుపెట్టింది. అయితే మిగతా ఇద్దరు హీరోయిన్ల విషయంలో ఒకరుగా పాయల్ రాజ్ పుత్ పేరును పరిశీలిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news