Gossipsనాని టీజర్ డేట్ వచ్చేసింది..!

నాని టీజర్ డేట్ వచ్చేసింది..!

వరుస హిట్లతో బాక్సాఫీస్ కళకళలాడేలా చేస్తున్న నాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్, నిన్ను కోరి సినిమాలతో హిట్ అందుకోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. వేణు శ్రీరాం డైరక్షన్ లో నాని నటిస్తున్న సినిమా ఎం.సి.ఏ. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద అంచనాలను పెంచగా ఈ సినిమా టీజర్ ఈ నెల 10న ఉదయం 10 గటలకు వస్తుందట.

మధ్యతరగతి కుటుంబం వారి కష్టసుఖాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో ఫిదాతో క్రేజీ హిట్ సాధించిన భానుమతి అలియాస్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. నానితో నేను లోకల్ తీసి హిట్ అందుకున్న దిల్ రాజు మరోసారి ఎం.సి.ఏతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి టీజర్ ఏమేరకు సినిమా మీద అంచనాలను ఏర్పరచుతుందో చూడాలి.

ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నం చేసిన వేణు శ్రీరాం సెకండ్ ప్రయత్నంగా చేస్తున్న ఈ ఎం.సి.ఏ ఎలా ఉంటుందో చూడాలి. దిల్ రాజు క్యాంప్ నుండి సేఫ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా తప్పకుండా నాని కెరియర్ లో మరో హిట్ ఇస్తుందని ఆశిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news