నాని బ్యాడ్ టైం స్టార్ట్

nani's bad time started with KAY

నాచురల్ స్టార్ నాని హీరోగా రీసెంట్ గా వచ్చిన సినిమా కృష్ణార్జున యుద్ధం. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ లో నటించాడు. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న నాని ఈ సినిమా ఎక్కువ హైప్ తో రిలీజ్ అయ్యింది. అయితే ఎందుకో ఆడియెన్స్ ఈ సినిమాను యాక్సెప్ట్ చేయలేకపోయారు.

 

నాని రెగ్యులర్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉన్నా సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బొక్క బోర్లా పడింది. 30 కోట్ల ప్రీ రిలీజ్ తో వచ్చిన ఈ కృష్ణార్జున యుద్ధం సినిమా వారంలో 14 కోట్లు మాత్రమే తీసుకురాగలిగింది. ఇక ఆపైన వస్తే గిస్తే మరో 2,3 కోట్లు రావొచ్చని అంచనా. ఇలా చూస్తే కృష్ణార్జున యుద్ధం భారీ లాస్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.

 

నాని క్రేజ్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను దిల్ రాజు కొనేశారు. ప్రస్తుతం నాని శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో నాగార్జున కూడా ఉన్నాడన్న సంగతి తెలిసిందే.

 

 

Leave a comment