నానికి కష్టాలు తప్పేలా లేవు..?

అదేంటీ వరుస విజయాలతో దూసుకు పోతున్న నేచురల్ స్టార్ నానికి కష్టాలేంటీ అని అనుకుంటున్నారా? అబ్బే అది సినిమా విషయం. ప్రస్తుతం కె.విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాని ‘గ్యాంగ్ లీడర్ ’మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్‌కు వాయిదా పడిన్నట్లు సమాచారం . ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఇటీవల ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ సినిమాను ఆగస్టు 30 రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి కారణం ప్రభాస్ అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’ మూవీ ఆగస్టు 15 న రిలీజ్ కాబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల సాహూ మూవీ రిలీజ్ డేట్ మార్చారు.

దీంతో గ్యాంగ్‌ లీడర్‌కు పెద్ద కష్టం వచ్చి పడింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఢీ కొట్టడం అంటే కష్టమైన పని. ఒకవేళ అదే నిజమైతే గ్యాంగ్ లీడర్‌ రిలీజ్‌ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో గ్యాంగ్ లీడర్‌ కూడా వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది .

Leave a comment