Gossipsనాని ' గ్యాంగ్ లీడ‌ర్ ' క్రేజ్ మామూలుగా లేదుగా...

నాని ‘ గ్యాంగ్ లీడ‌ర్ ‘ క్రేజ్ మామూలుగా లేదుగా…

నేచురల్ స్టార్ నాని వరుస సూపర్ హిట్ లతో టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. నాని నటించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1991లో రిలీజ్ అయ్యి చిరు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయిన గ్యాంగ్ లీడర్ టైటిట్‌తో నాని నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. వైవిధ్యమైన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 30న రిలీజ్ కావాల్సి ఉంది.

ఆరోజు సాహో లాక్ అవడంతో గ్యాంగ్ లీడ‌ర్‌ సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా పడింది. ఇక ఈ సినిమాకు బిజినెస్ వర్గాల్లో అదిరిపోయే క్రేజ్ వస్తోంది. టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉండడంతో టాలీవుడ్ బడా నిర్మాతల‌ నుంచి పెద్ద నిర్మాత‌ల‌ వరకూ… ఇంకా చెప్పాలంటే లోక‌ల్ డిస్ట్రిబ్యూట‌ర్లు సైతం ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. దీనిని బ‌ట్టే గ్యాంగ్ లీడ‌ర్‌కు ఉన్న డిమాండ్ తెలుస్తోంది.

విచిత్రం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా అక్టోబ‌ర్ 2న రిలీజ్ కావాల్సి ఉన్నా…. వాయిదా ప‌డుతుంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. దీంతో సైరా వాయిదా ప‌డితే ద‌స‌రాకు కూడా రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నారు. ఈ యేడాది స‌మ్మ‌ర్లో జెర్సీ సినిమాతో ప్రేక్ష‌కుల మ‌న్న‌నలు పొందిన నాని ఇప్పుడు మ‌రోసారి కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా తెర‌కెక్కిన గ్యాంగ్ లీడ‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news