నాని ని భయపెట్టిన యూట్యుబ్ చానెల్స్

nani-fires-on-youtube-channels

సోషల్ మీడియాలో సినిమా వాళ్ల రచ్చ అందరికి తెలిసిందే. అన్యాయం జరిగిందని ఒకరు.. పబ్లిసిటీ స్టంట్ తో మరొకరు ఇలా ఏం చేసినా ఎలా చేసినా సోషల్ మీడియాలో నానా రచ్చ చేసేస్తున్నారు. ఇక ఈమధ్య సెన్సేషనల్ శ్రీరెడ్డి గురించి తెలిసిందే. లైవ్ లో ఎలాంటి భాష మాట్లాడాలి అన్న ఇది కూడా తెలియకుండా దారుణంగా మాట్లాడుతున్నారు.

ఇక దీని గురించే నాచురల్ స్టార్ నాని మరోసారి నోరు విప్పాడు. కృష్ణార్జున యుద్ధం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో సినిమాలకు సెన్సార్ ఉంది కాని ఇంట్లో పిల్లలు, ఫ్యామిలీతో చూసే టివిలకు సెన్సార్ లేకుండా పోయిందని అన్నాడు. అంతేకాదు రిజిస్టర్ మీడియా ఛానెల్స్ కు కాస్త నియంత్రణ ఉంటుంది.. యూట్యూబ్ ఛానెల్స్ తోనే ఇష్టమొచ్చిన హెడ్డింగులు పెట్టి రచ్చ చేస్తున్నారని అన్నాడు నాని.

శ్రీదేవి లాంటి మహానటి చనిపోతే.. మా నాన్నను చంపేయాలని ఉందని ఓ యూట్యూబ్ ఛానెల్ హెడ్డింగ్ పెట్టారు. అది ఎంత దారుణమో కేవలం క్లిక్కుల కోసం, హిట్ల కోసం ఇలా చేస్తారా అంటూ యూట్యూబ్ ఛానెల్స్ మీద తన అసహ్యాన్ని వెళ్లబుచ్చాడు నాని.

Leave a comment