ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను వెనక్కి నెట్టిన నాని.. పవన్ కు దగ్గరలో..!

nani-ntr-allu-arjun

నాచురల్ స్టార్ నాని ఏకంగా స్టార్ హీరోలైన ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లను దాటేశాడు. స్టార్ క్రేజ్ లో వారి కన్నా ఎక్కువా తక్కువా అన్నది పక్కన పెడితే ట్విట్టర్ ఫాలోవర్స్ లో మాత్రం తారక్, బన్నిల కన్నా నాని క్రేజీ ఫాలోవర్స్ ను ఏర్పరచుకున్నాడు. తన నాచురల్ నటనతో అందరిని ఇంప్రెస్ చేస్తున్న నాని ట్విట్టర్ ఫాలోవర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సమానంగా ఉండటం విశేషం.

ఎన్.టి.ఆర్ ట్విట్టర్ ఫాలోవర్స్ 2.34 మిలియన్స్ ఉండగా బన్ని అలియాస్ అల్లు అర్జున్ 2.53 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను 3.05 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతుండగా నాచురల్ స్టార్ నానిని 3 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. ఈమధ్యనే బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని తన సహజ నటనతో అందరిని అలరిస్తున్నాడు.

చూస్తుంటే నాని పవన్ కళ్యాణ్ ను కూడా దాటేసేలా ఉన్నాడు. ఇక ట్విట్టర్ లో టాలీవుడ్ లో నెంబర్ 1 గా ఉంది మాత్రం సూపర్ స్టార్ మహేష్. 6.61 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్ లో టాప్ 2లో ఉన్నాడు. సౌత్ ఇండియా హీరోలలో మహేష్ కన్నా ముందు ధనుష్ ట్విట్టర్ ఫాలోవర్స్ 7 మిలియన్స్ పైగా ఉండటంతో మొదటి స్థానంలో ఉన్నాడు.

Leave a comment