స్టార్ హీరోల పై నాని వివాదాస్పద వ్యాఖ్యలు..

nani comments on star heros
తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలోకి ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన హీరో  నేచురల్ స్టార్ నాని. ఇతగాడు కేవలం తొమ్మిదేళ్ల సమయంలోనే 20 సినిమాలు పూర్తి చేశాడు. కెరియర్ స్టార్టింగ్ లో  చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ హీరో ఆ తరువాత తరువాత మినిమమ్ గ్యారంటీ హీరో రేంజ్‌ నుంచి నిర్మాతల హీరోగా మారిపోయాడు. ఇప్పుడు స్టార్ హీరోలనే భయపెట్టే స్థాయికి వెళ్ళిపోయాడు ఈ హీరో. తాజాగా ఇతగాడు ఓ ఇంటర్వ్యూ లో స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసి అందరికి దిమ్మతిరిగిపోయే ఝలక్ ఇచ్చాడు.
వరుస విజయాలతో దూసుకుపోతూ ఆరు హిట్ సినిమాలు చేసిన నాని ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ స్టార్ హీరోలని టార్గెట్ చేసినవిగా ఉన్నాయని కొందరు నానిపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మీకేమి కావాలో చెప్పండి అంటూ  అభిమానులని హీరోలు అడగడంలో అర్ధం లేదని కామెంట్ చేశాడు నాని.
వాస్తవానికి  ఆడియో రిలీజ్, ప్రెస్ మీట్స్‌లో అభిమానుల గురించి మన హీరోలు మాట్లాడే ఏ ఒక్క మాట లో కూడా నిజం ఉండదని నాని చెప్పుకొచ్చాడు. ఆడియో రిలీజ్ కార్యక్రమాల్లో  ‘కుటుంబం కంటే అభిమానులే ఎక్కువ, వాళ్ళు నాకు ఆత్మీయులు’ అని స్టార్ హీరో చిన్న డైలాగ్ చెప్తే చాలు అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. కానీ వాస్తవ జీవితంలోకి వెళ్తే మాత్రం అందుకు భిన్నంగా హీరోలు బిహేవియర్ చేస్తుంటారని నాని చెప్పుకొచ్చాడు.
నేను  కమల్ అభిమానిని అని, .సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి సినిమాలు చూసిన తరువాత అయన అభిమానిగా మారానని చెప్పాడు. అయితే కమల్ వచ్చి నీకు ఎలాంటి సినిమా కావాలో చెప్పమని అభిమానులని ఎప్పుడు అడగలేదు అంటూ ట్విట్ చేశాడు. ఇదే సందర్భంలో తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని తాను సినిమాలు చేస్తాను కానీ వాళ్ళకు ఏం కావాలని అడగనని చెప్పుకొచ్చాడు ఈ సింప్లీ హీరో. ఇంతవరకు నానీ చెపుతున్న మాటలు బాగానే అనిపించినా నాని మాటల వెనుక పరమార్ధం మాత్రం వేరే ఉంది. అయినా ఈ మధ్య కాలంలో నానికి బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది.

Leave a comment