శ్రీ కి పిచ్చెక్కిస్తున్న నాని..!

nani-case-files-on-sree-reddy

కాస్టింగ్ కౌచ్ అంటూ కొన్నాళ్లు హడావిడి చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు పర్సనల్ గా కొందరిని టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా ఈమధ్య కాలంలో నాచురల్ స్టార్ నానిని శ్రీరెడ్డి ఎక్కువ విసిగిస్తుంది. నాని + శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్ లాంటి కామెంట్లు వింటూనే ఉన్నాం. సరిగ్గా నాని బిగ్ బాస్ హోస్ట్ గా చేసే టైంకు ఈ న్యూసెన్స్ మరి ఎక్కువైంది. ఇక నాని ఈ విషయం మీద స్పందించాల్సిన టైం వచ్చిందని గుర్తించాడు.

అందుకే శ్రీరెడ్డికి గూబ అదిరే పంచ్ ఇచ్చాడు. ఆమెకు లీగల్ నోటీసులు ఇస్తున్నట్టు ట్విట్టర్ లో ఎనౌన్స్ చేశాడు నాని. తన మీద కొన్నాళ్లుగా బేస్ లెస్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారికి నా సమాధానం ఇదే అంటూ నాని లీగల్ గా వెళ్తున్నాడు. ఆల్రెడీ నోటీసులు డిస్ ప్యాచ్ అయ్యాయని చెప్పుకొచ్చాడు.

నాని ఇమేజ్ ను దెబ్బతీసేలా శ్రీరెడ్డి వ్యాఖ్యలు ఉండటం విశేషం. ఇక ఈ విషయాల పట్ల తానేమి బాధపడట్లేదని కాని ఇది అందరికి హాని కలిగిస్తుందని.. సమాజానికి కూడా ఇబ్బందని అన్నారు నాని. మరి నాని లీగల్ నోటీసులకు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా శ్రీరెడ్డి ఇలా నీచంగా కామెంట్స్ చేయడం తెలుగు ఆడియెన్స్ కు నచ్చట్లేదు. ఏదైనా ఉంటే పర్సనల్ గా చూసుకోవాలి కాని ఇలా పబ్లిక్ ఫోరంలో వారి ఇమేజ్ కు భంగం కలిగించడం అనేది నిజంగానే మంచి పద్ధతి కాదు.

Leave a comment