మల్టీస్టారర్ టైటిల్ అదిరింది.. దేవదాసుగా వారిద్దరు..!

5

మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుస్తున్న టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ మీద ఉంది. కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ స్పెషల్ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా దేవదాసు అని పెట్టారట.

దేవదాసు అనగానే ఏయన్నార్ నటించిన సినిమా గుర్తుకొస్తుంది. కాని ఈ దేవదాసు సినిమా ఫుల్ ఫన్ తో వస్తుందట. సినిమాలో డాన్ గా నాగార్జున, డాక్టర్ గా నాని కనిపించనున్నారు. నాగ్ దేవగా.. నాని దాసుగా నటిస్తున్నారట. ఇద్దరి పేర్లతో దేవదాసు అని టైటిల్ ఫిక్స్ చేశారు.

అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక, ఆకాంక్ష సింగ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Leave a comment