Gossipsఎన్టీఆర్ రోల్ లో నాని.. రిస్క్ చేస్తున్నాడేమో..!

ఎన్టీఆర్ రోల్ లో నాని.. రిస్క్ చేస్తున్నాడేమో..!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన ఈతరం హీరోల్లో నాని అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఏడాదికి 3 సినిమాలు చేయడమే కాదు 3 సినిమాలు హిట్లు కొడుతూ సత్తా చాటుతున్నాడు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నాని ఇప్పుడు ఏకంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావులా కనిపించబోతున్నాడు.

నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సావిత్రి బయోపిక్ గా వస్తున్న మహానటి సినిమాలో కీర్తి సురేష్ మహానటి లీడ్ రోల్ చేస్తుందగా.. సమంత జమునగా.. విజయ్ ఏయన్నార్ గా నటిస్తున్నారు. ఇక ఎన్.టి.ఆర్ రోల్ కోసం జూనియర్ ను అడుగగా సున్నితంగా తిరస్కరించాడట. ఇప్పుడు ఆ రోల్ కు నాచురల్ స్టార్ నానిని తీసుకున్నారని టాక్. ఎన్.టి.ఆర్ గా నాని కచ్చితంగా మంచి అవకాశమే కాని నాని ఈ పాత్ర చేసి రిస్క్ లో పడే అవకాశాలు లేకపోలేదు.

ఎన్.టి.ఆర్ రోల్ లో ఏమాత్రం తేడా వచ్చినా నందమూరి అభిమానులకు నాని దూరం అయినట్టే. ఇన్నాళ్లు ఎవరి ఫ్యాన్స్ ను హర్ట్ చేయని నాని ఎన్.టి.ఆర్ రోల్ అదిరిపోయేలా చేస్తే నందమూరి ఫ్యాన్స్ మెప్పు పొందుతాడు. లేదంటే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయాలను నాని గమనిస్తాడని అనుకోవచ్చు.

http://www.telugulives.com/telugu/ntr-29th-film-update/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news