నంది వివాదం… పవన్ పరిష్కారం

pawan kalyan

కొద్దిరోజులుగా అటు టాలీవుడ్ ని కుదిపేస్తున్న నంది అవార్డుల ఎంపికపై ఇప్పటి వరకు చాలామందే స్పందించారు. రకరకాల ఆరోపణలు చేశారు. ఆఖరికి కులాల మధ్య కుంపటి కూడా పెట్టేసారు. అక్కడితో ఆగితే పర్లేదు ఈ వివాదాన్ని తెలుసుకెళ్లి అటు నందమూరి- ఇటు మెగా ఫ్యామిలి కి అంటించేసారు. దీంతో ఇప్పటివరకు కలిసికట్టుగా ఉందన్న టాలీవుడ్ లో ఇన్ని విభేదాలు ఉన్నాయా ..? ఒకరంటే ఒకరికి పాడడం లేదా అనే సంకేతాలు సామాన్యుల్లో కూడా పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది.

అయితే ఇప్పటివరకు ఈ వివాదం మీద చిన్న చితక వారు తప్ప టాలీవుడ్ పెద్దలు ఎవరూ నోరుమెదపలేదు కానీ లోలోపల మాత్రం రగిలిపోతున్నారు అనేది అందరికి తెలిసిందే. అయితే దీనికి ఎక్కడో ఒకచోట పులిస్టాప్ పెట్టక పోతే టాలీవుడ్ పరువు గంగలో కలిసిపోయే ఛాన్స్ అయితే ఉంది.

ఒక్కొక్కరు తమ అభిప్రాయం వెళ్లబుచ్చడంతో దీనిపై పెద్ద చర్చే నడుస్తుంది. నంది అవార్డుల ఎంపిక విధానంలో జ్యూరీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు కూడా కొంత దుమారాన్ని రేపాయి. ఇక హాట్ టాపిక్ అయిన ఈ విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలుగ చేసుకుని అందరిని శాంతింపచేస్తాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

ఒక్కొక్కరిగా తమ అసంతృప్తి తెలియచేస్తున్న ఈ అవార్డుల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా పవన్ చొరవ తీసుకునే అవకాశం అయితే ఉందని సీని పెద్దలే కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పవన్ ఏమి మాట్లాడుతాడో ఇప్పటివరకు క్లారిటీ లేదు. అజ్ఞాతవాసి చివరి షెడ్యూల్ కోసం ఫారిన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ నంది  అవార్డుల గొడవపై తొందరలోనే స్పందిస్తాడు అని ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. చూద్దాం పవర్ స్టార్ తన పవర్ ఎంతవరకు చూపిస్తాడో !

 

Leave a comment