ఎన్టీఆర్ వారసుడు.. బాలయ్య మనసు కదిలించాడా..!

nandhamuri-family-details

నందమూరి వంశంలోకి మరో వారసుడు వచ్చాడు. రావడం రావడమే కొత్త సంబరాలను తెచ్చాడు. ఎన్.టి.ఆర్, ప్రణతిలకు రెండవ సంతానంగా కొడుకు పుటాడు. ఈ వార్త నందమూరి ఫ్యాన్స్ కే సర్ ప్రైజ్ న్యూస్ అయ్యింది. ఇక ఈ న్యూస్ తో అటు ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ ఫ్యామిలీస్ లోనే కాదు నందమూరి నట సింహం బాలకృష్ణ ఇంట్లో కూడా సంతోషం నిండేలా చేసిందట.

అవును నిజమే.. తారక్ ను ప్రస్తుతానికి దూరం పెట్టినా అతని మంచి కోరే బాలయ్య.. ఎన్.టి.ఆర్ కు కొడుకు పుట్టిన విషయం తెలుసుకుని సంతోష పడ్డాడట. ఈ బుడతడు మాములోడు కాదు పుట్టగానే చినతాత మనసు మార్చాడు. ఇక బాబు 21వ రోజు వేడుకకు బాలకృష్ణ వచ్చినా వచ్చేస్తాడని అనుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇక మళ్లీ నందమూరి హీరోలంతా ఒకటి అయినట్టే. ఆ సందర్భం వస్తే ప్రతి నందమూరి అభిమాని రెంట్టిపు ఆనందంతో కనిపిస్తారు. మరి ఎన్.టి.ఆర్ వారసుడి రాక ఎలాంటి మహాద్భుతాలు జరుగుతాయో చూడాలి.

Leave a comment