Gossipsబిగ్ బాస్ హౌజ్ లో నందమూరి హీరో.. రెండో సీజన్ లో...

బిగ్ బాస్ హౌజ్ లో నందమూరి హీరో.. రెండో సీజన్ లో కూడా..!

బిగ్ బాస్ సెకండ్ సీజన్ జూన్ 10 నుండి మొదలవనుంది. నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా రాబోతున్న ఈ రియాలిటీ షో మొదటి సీజన్ కన్నా ఇంకాస్త స్పైసీనెస్ యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసి షో సక్సెస్ అవడంలో ముఖ్య పాత్ర పోశించాడు. ఇక ఇప్పుడు నాని మీద ఆ బాధ్యత పెట్టారు స్టార్ మా నిర్వాహకులు.

ఇక ఈ సీజన్ లో కంటెస్టంట్స్ గా క్రేజీ సెలబ్రిటీస్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మొదటి సీజన్ లో చిన్న నటులకే ప్రాధాన్యత ఇచ్చారు. కాని ఈసారి మాత్రం టాప్ సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌజ్ లో ఉండేలా చూస్తున్నారట. ఇప్పటికే ఆ లిస్ట్ రెడీ అయ్యింది. వారం నుండి బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో హడావిడి చూస్తూనే ఉన్నాం.

ఇక ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టంట్ గా నందమూరి హీరో తారకరత్న ఉంటున్నారట. నందమూరి హీరోగా ఒకేసారి 9 సినిమాల ఓపెనింగ్ తో సంచలనం సృష్టించిన తారకరత్న స్టార్ ఇమేజ్ సంపాదించలేకపోయాడు. ఇక ఈమధ్య విలన్ గా ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టంట్ గా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. మరి బిగ్ బాస్ వన్ ఆ ఎన్.టి.ఆర్ అదరగొట్టగా బిగ్ బాస్-2 లో ఈ ఎన్.టి.ఆర్ ఎలా అలరిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news