ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీ పడుతున్న నందమూరి ఫ్యామిలీ ఎవరెవరో తెలుసా ?

ntr biopic movie details

ప్ర‌స్తుతం టాలీవుడ్ బాలీవుడ్ ల‌లో బ‌యోపిక్ ట్రెండ్ న‌డుస్తోంది. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ని సినిమా మ‌లిచే క్ర‌మంలోఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కుల మ‌ధ్య పెద్ద పోటీనే నెల‌కొంది.ఆర్జీవీ..తేజ.. వీరిద్ద‌రిలో గెలుపు ఎవ‌రిద‌న్న‌ది మ‌రికొద్ది కాలంలో తేలిపోనుంది.బాల‌కృష్ణ త‌న తండ్రి పాత్ర‌లో న‌టిస్తూ, నిర్మిస్తున్న సినిమా విష‌య‌మై దర్శకుడు తేజ ఆసక్తికరమైన ప్రతిపాదన తెస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందే ఈ సినిమాలో నందమూరి కుటుంబ స‌భ్యులు అంతా నటిస్తే బావుంటుందనేది తేజ ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తాడని మొదటి నుంచినే వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో బాలయ్య తనయుడు మోక్ష‌జ్ఞ‌ కూడా నటించనున్నాడు. ఇంత వరకే అనుకుంటే.. ఈ సినిమాలో నందమూరి కుటుంబంలోని మిగతా హీరోలు కూడా నటిస్తే బాగుంటుందని తేజ భావిస్తున్నాడని, ఈ మేరకు వారి చేత నటింపజేయడాని కి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశాడని వార్తలు వస్తున్నాయి.ఇక ఎన్టీఆర్ , క‌ల్యాణ్ రామ్ ఏమంటారో అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిదాయ‌క‌మైన చ‌ర్చ.

Leave a comment