టాలీవుడ్‌కే దిమ్మతిరిగిపోయే సినిమా.. నందమూరి ఫ్యామిలీ హీరోలంతా ఒకే చోటా!

Nandamuri Family Heroes To Do A Movie All Together

Tollywood has seen the entire family of Akkineni Nageshwar Rao in Manam Movie. Now Nandamuri Family is getting ready for a family film with Nandamuri Heroes.

అక్కినేని ఫ్యామిలీకి చిరకాలం గుర్తుండిపోయే సినిమా ఏదైనా ఉందంటే అది మనం అని చెబుతారు అందరూ. ఇప్పుడు మనం అనే పదాన్ని మేము కూడా ఉపయోగించుకుంటాం అని అంటోంది ఓ సెలబ్రెటీ ఫ్యామిలీ. టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ అన్నా.. నందమూరి హీరోలు అన్నా ఎనలేని ఫాలోయింగ్ ఉంది. నందమూరి హీరోల్లో ముఖ్యంగా ఎన్టీఆర్‌, బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. వీరంతా కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే అదిరిపోతోంది. కానీ ఈ ఊహ త్వరలోనే నిజరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది.

అయితే.. నందమూరి ఫ్యామిలీ సినిమా అనగానే బాలయ్య-ఎన్టీఆర్ కాంబినేషన్ ఉంటుందని ఊహించుకోవడం కాస్త కష్టమే కానీ.. ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ అండ్ ఫ్యామిలీ మొత్తం నటించనున్నారట. ఇందులో నందమూరీ కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను హరికృష్ణకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. హరికృష్ణతో సీతయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన వైవీఎస్ చౌదరీ గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. దీంతో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని రాబట్టుకోవడానికి ఏకంగా నందమూరి హీరోలందరినీ ఒకే స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేస్తున్నాడట.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ కేమియో రోల్‌లో మాత్రమే కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ హీరోల సినిమాలు అంటేనే ఓ రేంజులో ఎగబడిపోయే జనాలకు.. ఒకేసారి ట్రిపుల్ ధమాకా ఇస్తామంటే ఊరుకుంటారా.. థియేటర్ టాప్ లేపేయడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కించేయాలని ట్రై చేస్తున్నాడు వైవీఎస్.

Leave a comment