మహర్షి ట్రైలర్.. రికార్డులే రికార్డులు..!

33

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా ట్రైలర్ బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా రాగా విజయ్ దేవరకొండ కూడా మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడిని అలరిస్తుంది. నిన్న రాత్రి రిలీజైన మహర్షి ట్రైలర్ 8 గంటల్లోనే రికార్డులు సృష్టించింది.

ట్రైలర్ 4 గంటల్లో 1 మిలియన్ మార్క్ వ్యూస్ అందుకోగా.. 8 గంటల్లో 2 మిలియన్ వ్యూస్ సాధించాడు. మహేష్ మహర్షి నిజంగానే అద్భుతాలు సృష్టించేలా ఉంది. గొప్ప కథతో వంశీ పైడిపల్లి ఈ సినిమా చేస్తున్నాడని అనిపిస్తుంది. మే 9న మహేష్ ఫ్యాన్స్ కు పండుగ తెచ్చేస్తుందని అంటున్నారు. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేసిన మహర్షి మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

మహేష్ కెరియర్ లో 25వ సినిమా అయిన మహర్షి నిజంగానే కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Leave a comment