Gossipsమ‌హానుభావుడుతో చై

మ‌హానుభావుడుతో చై

కొత్త పెళ్లికొడుకు నాగ‌చైత‌న్య కు సంబంధించిన మ‌రో వార్త ఇది. మ‌హానుభావుడు విజ‌యంతో మంచి ఫాంలో ఉన్న మారుతి డైరెక్ష‌న్లో ఆయ‌నో సినిమా చేయ‌నున్నాడు. ఇందుకు సంబంధించి డైరెక్ట‌ర్ మారుతి క్లారిటీ ఇచ్చాడు కూడా! వ‌రుస‌గా యువ ద‌ర్శ‌కుల‌తోనే ప‌నిచేస్తున్న చై.. త్వ‌ర‌లో ఆయ‌న స‌వ్య‌సాచితో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. వివాహం అనంత‌రం ప్రేమమ్ డైరెక్ట‌ర్ చందూ మొండేటీ డైరెక్ష‌న్లో ఈ స‌వ్య‌సాచి షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌గ‌నుంది. ఇది పూర్తికాగానే మారుతీ సినిమా ఉంటుంది. అక్కినేని హీరోలంటే ప్రేమకథలకు పెట్టింది పేరని.. చైతూ కూడా ఇప్పటిదాకా మంచి ప్రేమకథలు చేశాడని.. తాను చైతూతో చేసేది కూడా ప్యూర్ లవ్ స్టోరీ అని మారుతి వెల్లడించాడు. ఈ చిత్రంలో కథానాయికగా అను ఇమ్మాన్యుయెల్ నటిస్తుందని కూడా మారుతి తెలిపాడు. మున్ముందు టాలీవుడ్ పెద్ద హీరోలందరితోనూ కలిసి పని చేయాలని.. పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని మారుతి చెప్పాడు. తన సినిమాలో ఒక సీన్ చూసినా.. అది తన సినిమా అని చెప్పేలా తనకంటూ ఒక ముద్ర ఉండేలా చూసుకుంటానని.. మున్ముందు వేర్వేరు జానర్లలో సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని అన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news